BAJAJ Water Geyser Price: చలికాలంలో వెచ్చని ఆఫర్‌.. కేవలం రూ.2,199లకే బజాజ్‌ వాటర్‌ గీజర్‌

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 19, 2023 | 12:04 PM

చలికాలంలో చల్లని నీళ్లతో స్నానం చెయ్యాలంటే ఏడుపొచ్చినంత పనవుతుంది. గ్యాస్‌ స్టౌ మీద కాసిన్ని నీళ్లు వేడి చేసుకుందామంటే మూడు నెలలు రావల్సిన గ్యాస్‌ పది రోజుల్లో అయిపోతుందనే భయం. ఇక ఎలక్ట్రిక్‌ గీజర్‌ కొందామంటే..

BAJAJ Water Geyser Price: చలికాలంలో వెచ్చని ఆఫర్‌.. కేవలం రూ.2,199లకే బజాజ్‌ వాటర్‌ గీజర్‌
BAJAJ Water Geyser

చలికాలంలో చల్లని నీళ్లతో స్నానం చెయ్యాలంటే ఏడుపొచ్చినంత పనవుతుంది. గ్యాస్‌ స్టౌ మీద కాసిన్ని నీళ్లు వేడి చేసుకుందామంటే మూడు నెలలు రావల్సిన గ్యాస్‌ పది రోజుల్లో అయిపోతుందనే భయం. ఇక ఎలక్ట్రిక్‌ గీజర్‌ కొందామంటే ఖరీదెక్కువేమోనని సామాన్యులు వెనకాడుతుంటారు. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ బజాబ్‌ అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. మూడు లీటర్ల కెపాసిటీ కలిగిన రూ. 5 వేల ఖరీదుగల BAJAJ 3 L Instant వాటర్ గీజర్‌పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది.

అవును.. ఈ గీజర్‌ను రూ.2,501 తగ్గింపుతో కేవలం రూ.2,499లకే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ గీజర్ పై వివిధ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. అలాగే పాత గీజర్‌ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.300 తగ్గింపు అందుకోవచ్చు. ఆ లెక్కన ఎలక్ట్రిక్‌ గీజర్‌ను రూ.2,199లకే కొనవచ్చన్నమాట. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ బడ్జెట్‌లోనే గీజర్‌ను కొనెయ్యండి.. ఈ చలికాలాన్ని వెచ్చగా మార్చుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu