AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Menstrual Leaves for Women: ఆడవారికి నెలసరి సమయంలో సెలవులు మంజూరు చేసిన రాష్ట్ర సర్కార్‌.. దేశ చరిత్రలోనే తొలిసారిగా..

ఆడపిల్లలకు నెలసరి సమయంలో సెలవులు (menstrual leave) మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్ధినులకు..

Menstrual Leaves for Women: ఆడవారికి నెలసరి సమయంలో సెలవులు మంజూరు చేసిన రాష్ట్ర సర్కార్‌.. దేశ చరిత్రలోనే తొలిసారిగా..
Menstrual Leaves
Srilakshmi C
|

Updated on: Jan 19, 2023 | 8:42 AM

Share

ఆడపిల్లలకు నెలసరి సమయంలో సెలవులు (menstrual leave) మంజూరు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్ధినులకు మెన్‌స్ట్రువల్‌ లీవ్స్‌ తీసుకునే వెసులుబాటునిస్తూ ప్రభుత్వం సోమవారం (జవనరి 16) ప్రకటన వెలువరించింది. మహిళా విద్యార్ధులకు నెలసరి సెలవులు ఇవ్వాలని కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వ సమర్ధించింది. దీంతో ఈ మేరకు అన్ని యూనివర్సిటీలలో ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు ఆదేశాలు జారీ చేశారు. నెలసరి సమయంలో విద్యార్ధినులు అనుభవిస్తున్న శారీరక, మానసిక ఇబ్బందులను పరిగననలోకి తీసుకుని ఇతర యూనివర్సిటీల్లో కూడా సెలవులు అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. సాధారణంగా అయితే కేరళలోని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న అమ్మాయిలకు కనీసం 73 శాతం హాజరు తప్పనిసరి. ఇక తాజాగా పీరియడ్ లీవ్స్ కూడా చేరడంతో కనీస వార్షిక హాజరు 71 శాతానికి చేరుకుంది.

దేశంలో తొలిసారిగా విద్యార్ధులకు పీరియడ్స్‌ సెలవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. కాగా గత డిసెంబరులో కొట్టాయంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 60 రోజుల మెటర్నిటీ సెలవులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.