AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai Bachchan: అందాల ఐశ్వర్యరాయ్‌కు కోర్టు నోటీసులు..! మళ్లీ వివాదంలో చిక్కుకున్న మాజీ విశ్వ సుందరి

ఈ బాలీవుడ్ బ్యూటీకి కోర్టు గత సోమవారం (జనవరి 9) నోటీసులు జారీ చేసింది. ఎన్ని సార్లు గుర్తుచేసినా స్పందించకపోవడంతో..

Aishwarya Rai Bachchan: అందాల ఐశ్వర్యరాయ్‌కు కోర్టు నోటీసులు..! మళ్లీ వివాదంలో చిక్కుకున్న మాజీ విశ్వ సుందరి
Aishwarya Rai Bachchan
Srilakshmi C
|

Updated on: Jan 19, 2023 | 6:29 AM

Share

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ వివాహం అనంతరం కూడా తనదైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 49వ పడిలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ యువ తారలకు ఏ మాత్రం తగ్గకుండా రానిస్తోంది. ఐతే తాజా ఈ బాలీవుడ్ బ్యూటీకి కోర్టు గత సోమవారం (జనవరి 9) నోటీసులు జారీ చేసింది. ఐశ్వర్యకు మహారాష్ట్రలోని నాసిక్‌ సిన్నార్‌లోని థాంగావ్ సమీపంలోని నాసిక్‌లోని అద్వాడిలో ఒక హెక్టారు భూమి ఉంది. దీనికి గానూ ఐశ్వర్య రూ.21,960లు ట్యాక్స్‌ బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆమె ఏడాది కాలంగా ల్యాండ్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని సమాచారం.

దీనిపై పదేపదే రిమైండర్లు జారీ చేసినా స్పందించకపోవడంతో సిన్నార్ జిల్లా తహసీల్దార్ నటికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన 10 రోజుల్లోపు ట్యాక్స్‌ చెల్లించకపోతే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం1966లోని సెక్షన్ 174 ప్రకారం ఐశ్వర్యపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేసింది. కాగా సిన్నార్‌లో ట్యాక్స్‌ ఎగ్గొట్టిన దాదాపు 1,200 మందిలో ఐశ్వర్య ఒకరు కావడం విశేషం. వీళ్ళందరూ కూడా టాక్స్‌ ఎగ్గొట్టడంతో ప్రభుత్వానికి 1.11 కోట్లు నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక సినిమాల విషయాని కోస్తే మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన తమిళ చారిత్రక ఇతిహాస చిత్రం పొన్నియిన్ సెల్వన్‌తో ఐశ్వర్య రాయ్‌ ఘన విజయం అందుకుంది. ఐశ్వర్య రాయ్‌తోపాటు కార్తీ, విక్రమ్, జయం రవి, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని సీక్వెల్‌ పొన్నియిన్ సెల్వన్: 2 ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.