IB Recruitment 2023: పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 ఉద్యోగాలు.. ఇలా ఎంపిక చేస్తారు..

కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో విశాఖపట్నంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. 1675 సెక్యురిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌, మల్టిపుల్ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IB Recruitment 2023: పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 ఉద్యోగాలు.. ఇలా ఎంపిక చేస్తారు..
Intelligence Bureau
Follow us

|

Updated on: Jan 18, 2023 | 12:41 PM

కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో విశాఖపట్నంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. 1675 సెక్యురిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌, మల్టిపుల్ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 10, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 రాత పరీక్ష (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles