AP Govt Jobs 2023: రాత పరీక్షలేకుండా విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగాలు.. టెన్త్‌/డిగ్రీ అర్హత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌తోపాటు ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

AP Govt Jobs 2023: రాత పరీక్షలేకుండా విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగాలు.. టెన్త్‌/డిగ్రీ అర్హత..
DMHO Visakhapatnam
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2023 | 12:18 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 33 మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డిప్లొమా, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు జనవరి 21, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌లో సమర్పించాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నోటిఫికేషన్లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • పీడియాట్రిషియన్ పోస్టులు: 5
  • ఎర్లీ ఇన్వెన్షన్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు: 2
  • అడోలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ కౌన్సెలర్ పోస్టులు: 6
  • హాస్పిటల్ అటెండెంట్ పోస్టులు: 1
  • శానిటరీ అటెండెంట్ పోస్టులు: 3
  • సైకియాట్రిస్ట్‌ పోస్టులు: 1
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 13
  • క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు: 1
  • డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 1

అడ్రస్..

District Medical and Health Officer, Visakhapatnam, AP.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.