CBI Raids: రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ఇంటిపై సీబీఐ ఆకస్మిక దాడులు.. 17 కేజీల బంగారం, రూ.4 కోట్లకుపైగా నగదు ఇంకా..

రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ఇంటిపై దాడి చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు 17 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సదరు రిటైర్డ్..

CBI Raids: రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ఇంటిపై సీబీఐ ఆకస్మిక దాడులు.. 17 కేజీల బంగారం, రూ.4 కోట్లకుపైగా నగదు ఇంకా..
Odisha News
Follow us

|

Updated on: Jan 18, 2023 | 9:25 AM

రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ఇంటిపై దాడి చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు 17 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సదరు రిటైర్డ్ ఇండియన్ రైల్వే అధికారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన ప్రమోద్ కుమార్ జెనా అనే వ్యక్తి నవంబర్ 2022లో భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ సెక్రటరీ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలో అతను ఆదాయానికి మించి భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో జనవరి 4న సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో రూ. 1.57 కోట్ల నగదు, 17 కిలోల బంగారం, రూ. 2.5 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ బ్యాంక్ పత్రాలు, కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతరుల పేరిట భువనేశ్వర్‌, కటక్‌, జగత్సింగ్‌పుర్‌లలో కూడా జెనాకు ఆస్తులున్నట్లు గుర్తించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ మాజీ అధికారి అయిన ప్రమోద్ కుమార్ జెనా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపి మరిన్ని వివరాలను తెలియజేస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు