Gangasagar Mela: పుణ్యస్నానాలకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుకున్న 511 మంది భక్తులు.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం..

మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన 500లకుపైగా భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. ఆదివారం (జనవరి 15) రాత్రంతా దట్టమైన మంచులో అక్కడే..

Gangasagar Mela: పుణ్యస్నానాలకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుకున్న 511 మంది భక్తులు.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం..
Gangasagar Mela
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 17, 2023 | 12:11 PM

మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన 500లకుపైగా భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. ఆదివారం (జనవరి 15) రాత్రంతా దట్టమైన మంచులో అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులతో రెండు పడవలు 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. పైగా అక్కడ దట్టమైన పొగమంచు కారణంగా శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ద్వీపానికి నౌకల రాకపోకలు నిలిపివేశారు.

కాక్‌ద్వీప్‌కు చేరుకోగానే భక్తులతో నిండి ఉన్న రెండు పడవలు బంగాళాఖాతం బురదలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా కూరుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వెంటనే భక్తుల పరిరక్షణ చర్యలు చేపట్టింది. సముద్రంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు తీరప్రాంతం వెంబడి మోహరించి, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తాజా నివేదికల ప్రకారం భక్తులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం ఉదయం 10 గంటల సమయానికి 511 మంది యాత్రికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది.

కాగా హుగ్లీ నది-బంగాళాఖాతం సంగమం దగ్గర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా 51 లక్షల మంది భక్తులు గంగా సాగర్‌ను సందర్శించి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు స్నానాలాచరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు