Aadhaar: ఆధార్‌ను విద్యుత్‌ కనెక్షన్‌తో లింక్‌ చేయించారా? రెండు వారాలే గడువు..

విద్యుత్‌ కనెక్షన్‌తో ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానానికి ప్రభుత్వం విధించిన గడువు జనవరి 31తో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 2.3 కోట్ల గృహ వినియోగదారులు, సుమారు 32 లక్షల అగ్రి సర్వీస్ కనెక్షన్లు ఉండగా.. వీరిలో ఇప్పటివరకు

Aadhaar: ఆధార్‌ను విద్యుత్‌ కనెక్షన్‌తో లింక్‌ చేయించారా? రెండు వారాలే గడువు..
Deadline For Linking Aadhaar With Eb
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2023 | 10:01 AM

విద్యుత్‌ కనెక్షన్‌తో ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానానికి ప్రభుత్వం విధించిన గడువు జనవరి 31తో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 2.3 కోట్ల గృహ వినియోగదారులు, సుమారు 32 లక్షల అగ్రి సర్వీస్ కనెక్షన్లు ఉండగా.. వీరిలో ఇంకా 70 లక్షల మంది విద్యుత్‌ కనెక్షన్లకు ఆధార్‌ అనుసంధానం ఇంకా పూర్తికాలేదు. ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వ విద్యుత్ వినియోగదారులను ఈ మేరకు అప్రమత్తం చేస్తోంది. కాగా గత నవంబర్‌లో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానించాలని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్‌ బాలాజీ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవసాయ, గృహ, పరిశ్రమల విద్యుత్‌ కనెక్షన్లకు ఆధార్‌ నెంబరు అనుసంధాన ప్రక్రియ డిసెంబర్‌ నెలతో ముగియగా, వినియోగదారుల విజ్ఞప్తి మేరకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది.

ఈ నేపథ్యంలో పూరి గుడిసెల్లో నివిసించేవారు, ఉచిత విద్యుత్ పొందే అగ్రి కనెక్షన్‌లతో సహా విద్యుత్‌ వినియోగదారులందరూ జనవరి 31వ తేదీలోపు విద్యుత్‌ కనెక్షన్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవల్సిందిగా మంత్రి ప్రకటించారు. ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి మొత్తం 2,811 సెక్షన్ కార్యాలయాల్లో మొబైల్ క్యాంపులను సైతం మంత్రి ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాల ద్వారా వినియోగదారులకు వారి ఆధార్‌ను సులభంగా లింక్ చేయడానికి వీలు కలుగుతుందని ఆయన తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.