Sports Authority of India: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. 11 యంగ్‌ ప్రొఫెషనల్ (అకౌంట్స్‌/ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Sports Authority of India: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా ఎంపిక..
Sports Authority Of India
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2023 | 1:05 PM

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. 11 యంగ్‌ ప్రొఫెషనల్ (అకౌంట్స్‌/ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అకౌంటింగ్‌/ఫైనాన్స్‌/కామర్స్‌ స్పెషలైజేషన్‌లో యూజీ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా సీఏ/ఐసీఎస్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 32ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 28, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 12, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.