- Telugu News Photo Gallery Technology photos Best gaming phones under 30000 Rupees with good processor and screen resolution like Redmi Note 12 Pro, iQOO 9 SE and Galaxy S20 FE Telugu Tech News
Gaming phones under 30k: గేమింగ్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారా.? రూ. 30 వేల లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే.
గేమ్స్‌కి సపోర్ట్ చేసే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోసం వెతుకుతున్నారా.? మీ బడ్జెట్ రూ. 30 వేల లోపా.. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్లు, ధర విశేషాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jan 19, 2023 | 1:29 PM

iQOO 9 SE: ఐకూ 9 సీఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 28,990గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచెస్ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

iQOO Neo 6: అమెజాన్ సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 27,999గా ఉంది. స్క్రీన్ విషయానికొస్తే 6.62 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 870 5జీ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. 4700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో కూడిన బ్యాటరీని అందించారు. ఇందులోని ప్రాసెసర్ గేమ్స్‌కి సపోర్ట్ చేస్తుంది.

Poco F4 5G: పోకో ఎఫ్4 5జీ, 6 జీబీ ర్యామ్ 128 జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999గా ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమ్స్‌కి పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇందులో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. 6.67 ఇంచెస్ ఈ4 అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు.

Redmi Note 12 Pro: రూ. 30 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో రెడ్‌మీ నోట్ 12 ప్రో మొదటి ప్లేస్‌లో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 24,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Samsung Galaxy S20 FE: గేమ్స్‌కి సపోర్ట్ చేసే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్20 ఎఫ్‌ఈ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 856 ప్రాసెసర్ గేమ్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 29,990గా ఉంది.





























