- Telugu News Photo Gallery Technology photos BMW unveils world's first colour changing car in Los Angels know price release date and more in Telugu
BMW i Vision Dee: 240 రంగులను మార్చుకోగల ఊసరవెల్లి కార్.. ఈ బీఎమ్‌డబ్ల్యూ కారు ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం రండి..
ఊసరవెల్లి తెలుసుకదా.. అది పరిస్థతులను బట్టి రంగులను మార్చుకుంటూ ఉంటుంది. ఈ కారు బీఎమ్‌డబ్ల్యూ కార్ కూడా అంతే.. తన రంగులను దానంతట అదే మార్చుకుంటుంది. ఈ కారు డిజిటల్ ఏమోషనల్ ఎక్స్ పీరియన్స్‌ను వినియోగదారులకు అందిస్తుంది. బీఎమ్‌డబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లో దీనిని ఆవిష్కరించింది. డ్రైవర్ మూడ్‌కు అనుగుణంగా 240 రంగులను మార్చుకోగలదు ఈ బీఎమ్‌డబ్ల్యూ కార్
Updated on: Jan 20, 2023 | 9:24 AM

BMW i Vision Dee: కారు కొనుగోలు చేసే సమయంలో అందరికీ ఎదురయ్యే పెద్ద సమస్య రంగు విషయం. సాధారణంగా ప్రజలు తెలుపు లేదా నలుప రంగులను ఇష్టపడుతుంటారు. తమ కొత్త కారు ప్రకాశవంతమైన రంగులో ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికే BMW ప్రత్యేకమైన మోడల్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లోకి రాబోతుంది. 2025 నుంచి మార్కెట్‌లోకి వచ్చే ఈ కార్‌ను.. లాస్ వెగాస్‌లో జరుగుతున్న CES ఈవెంట్‌లో BMW ప్రదర్శించింది. మరి దీని ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

BMW తన కాన్సెప్ట్ కారును ఐ విజన్ డీ పేరుతో లాస్ వెగాస్‌లోని CES ఈవెంట్ ప్రదర్శించింది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది దాని రంగును మార్చుకోగలదు. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ అయినప్పటికీ, కంపెనీ దీని ఉత్పత్తికి ప్లాన్ చేస్తోంది. ప్రజల స్పందన చూసి.. త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్ టెక్నాలజీ ఆటో ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని సాంకేతిక నిపుణులు నమ్ముతున్నారు.

BMW i Vision Dee మోడల్ కారుకు సంబంధించి మూడు బాడీ డిజైన్‌లను ప్రదర్శించింది BMW కంపెనీ. దాదాపు 240 రంగులను మార్చుకోగల ఈ కారుకు అది E Ink టెక్నాలజీతో సాధ్యమైంది. ఈ టెక్నాలజీని.. కారులోని అన్ని భాగాలలో ఉపయోగించారు. ప్రతి ప్యానెల్‌లో 32 రంగుల ఎంపికలు ఉన్నాయి. తద్వారా మీరు ఈ కారును ఒకే సమయంలో వేర్వేరు రంగులలోకి మార్చవచ్చు.

ఈ కారులో రంగు మారడమే కాకుండా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రొజెక్టింగ్ డ్రైవెన్ డేటా టెక్నాలజీని కూడా కలిగి ఉండబోతుంది. దాని సహాయంతో కారు విండ్‌షీల్డ్‌పైనే డిజిటల్ ఫార్మాట్‌లో డ్రైవింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందగలుగుతారు. ఇది నావిగేషన్, స్పీడ్, మైలేజ్ వంటి సమాచారాన్ని విండ్‌షీల్డ్‌లోనే ప్రదర్శిస్తుంది. తద్వారా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్యనూ ఎదుర్కోరు.

అయితే ఈ కారు విడుదల తేదీకి సంబంధించి BMW కంపెనీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ ఈ కారు ఉత్పత్తిపై కంపెనీ ఇప్పుడు తన పాజిటివ్ ప్రకటన చేసింది. అదే సమయంలో, ఈ కారు ధర గురించి ఎటువంటి చర్చా జరగలేదు. ఈ కారును ఉత్పత్తి చేస్తే అది ఎలక్ట్రిక్ కారు అవుతుందనీ, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మాత్రం చెప్పింది BMW.

ఇక ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ కార్..పోలీసులకు సమస్యగా మారబోతుందని సాంకేతిన నిపుణులు అంటున్నారు. సాధారణంగా కార్లతో నేరాలు జరిగినప్పుడు.. కారు రంగును కూడా క్లూగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కోసారి కారు వెంట పోలీసుల ఛేజింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ట్రాఫిక్‌లోనూ కారు రంగును బట్టీ.. అది ఎటు వెళ్తుందో గుర్తించగలరు. అదే రంగులు మారే కారు అయితే.. నేరస్థులు తప్పించుకునే ఛాన్స్ ఎక్కువ. అలాగని టెక్నాలజీని ఆపలేం. ఇలాంటి కార్లు వస్తే.. పోలీసులు కూడా తమ టెక్నాలజీని అందుకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందేనని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.





























