Aadhar Update: ఆధార్‌ కార్డులో తప్పులు దొర్లాయా..? నేటి నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు షురూ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డులో ఏవైనా తప్పులు దొర్లితే నేటి నుంచి అప్‌డేట్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది..

Aadhar Update: ఆధార్‌ కార్డులో తప్పులు దొర్లాయా..? నేటి నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు షురూ..
Aadhaar Update Special Camp
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 19, 2023 | 7:30 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డులో ఏవైనా తప్పులు దొర్లితే నేటి నుంచి అప్‌డేట్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 19, 20, 21, 23, 24 తేదీల్లో వరుసగా ఐదు రోజుల పాటు ఆధార్‌ అప్‌డేట్‌ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నిసచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనున్నట్లు ఏపీ సర్కార్‌ వెల్లడించింది. అనంతరం మళ్లీ ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రెండో విడత క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆధార్‌లో ఎవైనా తప్పుటు దొర్లితే ఏన్నో పనులు పెండింగ్‌లో పడిపోతుంటాయి. ఆధార్‌ సెంటర్‌లకు వెళితే అక్కడ రద్దీ రిత్యా పనులు సకాలంలో అవక ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోని వారున్నట్లు సమాచారం. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక క్యాంపులతో ఆధార్‌ అప్డేటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అంతేకాకుండా ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లకొకసారి ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ సాగిలి షన్‌మోహన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్‌చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్‌ సేవలు పొందే వెసులుబాటు కల్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!