Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: మొటిమలు, నల్లమచ్చలతో విసుగ్గెత్తిపోతున్నారా..? ఈ ఆయుర్వేద బ్యూటీ ట్రిక్స్ మీ కోసమే..

తరచూ ముఖం, శరీరానికి ఆయిల్ మసాజ్ చేయటం వల్ల కూడా పట్టులాంటి చర్మ సౌందర్యం పొందుతారు. తరచూ శరీరానికి ఆయిల్ మసాజ్ చేయించుకుంటే... రక్త ప్రసరణ బాగా జరిగి... అందంగా కనిపిస్తారు.

Skin Care Tips: మొటిమలు, నల్లమచ్చలతో విసుగ్గెత్తిపోతున్నారా..? ఈ ఆయుర్వేద బ్యూటీ ట్రిక్స్ మీ కోసమే..
Quick Glowing Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 19, 2023 | 3:12 PM

నలుగురిలో అందంగా కనిపించాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, మొటిమలు, నల్లమచ్చల కారణంగా చాలా మంది బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు. మొటిమలు, నల్లమచ్చలను తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలా అని.. మార్కెట్లో లభించే ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు వాడితే… ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనే భయం కూడా వారిని వెంటాడుతుంది. ఇలాంటి ఏం చేయాలనే సందేహం చాలా మందిని వెంటాడుతుంది. అలాంటి వారికోసం మన ఆయుర్వేదంలో అనేక మార్గాలున్నాయి. ఆయుర్వేదంలో సూచించిన ఉత్పత్తులు వాడితే… అందంగా మెరిసిపోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆయుర్వేదం ప్రకారం మనం రోజూ తినే అనేక కూరగాయలు, పండ్లు మనకు మంచి ఆరోగ్యాన్ని, అందాన్ని ఇస్తాయి. ముఖ సౌందర్యం కోసం పచ్చి కూరగాయలు, లేదంటే పచ్చి కూరగాయల జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. కూరగాయలతో జ్యూస్‌ చేసుకుని తీసుకోవడం వల్ల కూడా అందంగా తయారవుతారు. పసుపు, చందనం కలిపి తరచూ ముఖానికి మసాజ్‌ చేయటం వల్ల కూడా అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్నానం చేసే సమయంలో లేదంటే… మామూలుగా అయినా… వీటిని ముఖం, శరీరానికి రాసుకోవటం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇకపోతే కలబంద గుజ్జు కూడా మీ ముఖ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందాన్ని మెరుగుపరచడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి… ప్రతిరోజూ కలబంద గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల… అందంగా మెరిసిపోవచ్చు. తరచూ ముఖం, శరీరానికి ఆయిల్ మసాజ్ చేయటం వల్ల కూడా పట్టులాంటి చర్మ సౌందర్యం పొందుతారు. తరచూ శరీరానికి ఆయిల్ మసాజ్ చేయించుకుంటే… రక్త ప్రసరణ బాగా జరిగి… అందంగా కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆయుర్వేదం ప్రకారం తేనె కూడా మంచి సౌందర్య సాధానంగా చెప్పాలి. తేనె ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. అదే తేనెతో తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, నల్లటి మచ్చలు తగ్గుముఖం పడుతుంటాయి. పెదాలకు మసాజ్ చేస్తే… అవి మరింత మృదువుగా, అందంగా కనిపిస్తాయట. ఆయుర్వేదంలో ఉసిరికి ప్రాముఖ్యత ఎక్కువ. ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. నిమ్మకాయ, నారిజలో నూ విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారొచ్చు. అలాగే, వేపాకు నీటితో స్నానం చేయడం, తరచూగా ముఖాన్ని కడుక్కోవడం, లేదంటే తాగినా కూడా చర్మం పై అద్భుతాలు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..