AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి సర్జరీ చేసిన వైద్యులు, మిలటరీ ఇంజనీర్లు..

సైనికుడి పక్కటెముకలకు తగిలినా ఈ గ్రెనైడ్ పేలకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ సమయంలో డాక్టర్‌తో పాటు మిలటరీకి చెందిన కంబాట్ ఇంజనీర్లు ఉండటం ఇదే తొలిసారి.

సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి సర్జరీ చేసిన వైద్యులు, మిలటరీ ఇంజనీర్లు..
Grenade
Jyothi Gadda
|

Updated on: Jan 18, 2023 | 9:28 PM

Share

ఉక్రెయిన్‌ సైనికుడి ఛాతీలో గ్రెనైడ్ అమర్చబడి ఉంది. అది కూడా అతడు సజీవంగా ఉండగా. కొంచెం అజాగ్రత్త అంటే పేలిపోతుంది. కానీ ఉక్రెయిన్ సైనిక వైద్యుడు తన ప్రాణాలను పణంగా పెట్టి గ్రెనేడ్‌ను చాలా జాగ్రత్తగా బయటకు తీశాడు. ఇది సాధారణ శస్త్రచికిత్స కాదు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఉక్రెయిన్ సైనిక వైద్యులు అద్భుతమైన పని చేశారు. రష్యా సైనికులు ఉక్రేనియన్ సైనికుడిపై VOG గ్రెనేడ్‌ను కాల్చారు. ఈ గ్రెనైడ్  నేరుగా వెళ్లి సైనికుడి ఛాతీలోకి దిగింది. కానీ పేలలేదు. గ్రెనైడ్‌తో అతడు సజీవంగా ఉన్నప్పటికీ.. ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా అది పేలిపోయేది..దీని కారణంగా దానిని తొలగించడానికి ఉక్రెయిన్ సైనిక వైద్యులు చాకచక్యంగా వ్యవహరించారు.

ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మలియార్ తన ఫేస్‌బుక్‌లో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, కథనాన్ని పోస్ట్ చేశారు. ఇందులో సైనికుడి ఎక్స్‌రే కనిపిస్తుంది. ఒక X-రే ఛాతీ లోపల చిక్కుకున్న 40-millimetre (1.6 in) VOG గ్రెనేడ్‌ని చూపుతుంది. నిజానికి VOG గ్రెనైడ్ లాంచర్ నుండి కాల్చబడుతుంది. ఇది చేతితో విసిరిన గ్రెనైడ్ కి భిన్నంగా ఉంటుంది. ఇది లక్ష్యాన్ని తాకినప్పుడు, ఒత్తిడి సృష్టించడం వల్ల అది పేలుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ యుద్ధాలలో ఉపయోగిస్తుంటారు.

ఇదిలా ఉంటే, సైనికుడి పక్కటెముకలకు తగిలినా ఈ గ్రెనైడ్ పేలకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సర్జరీ సమయంలో కాస్త అజాగ్రత్త అయినా గ్రెనైడ్ పేలిపోవటం ఖాయం..సైనికులతో పాటు, వైద్యుల బృందం కూడా గాయపడతారు లేదా చాలా మంది చనిపోతారు. అప్పుడు ఈ శస్త్రచికిత్స బాధ్యతను ఉక్రెయిన్ అతిపెద్ద సైనిక సర్జన్ ఆండ్రీ వెర్బాకు అప్పగించారు. సర్జరీ సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో సైన్యానికి చెందిన ఇద్దరు కంబాట్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. దాంతో అతను గ్రెనైడ్ పేలకుండా వైద్యుడికి సహాయం చేశాడు. వైద్య సిబ్బందిని రక్షించగలడు. ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ సమయంలో డాక్టర్‌తో పాటు మిలటరీకి చెందిన కంబాట్ ఇంజనీర్లు ఉండటం ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి
Grenade1

ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్‌ అయింది. డాక్టర్ ఆండ్రీ వెర్బా కూడా శస్త్రచికిత్స తర్వాత అతని చేతిలో గ్రెనైడ్ ను చూపించాడు. VOG  గ్రెనైడ్ ను  లాంచర్ సహాయంతో అర కిలోమీటరు దూరంలో కూర్చున్న లక్ష్యాన్ని చేరవేయవచ్చు. శస్త్రచికిత్స సమయంలో, డాక్టర్ ఆండ్రి ఎలక్ట్రోకోగ్యులేషన్ ప్రక్రియను నిర్వహించలేదు. ఇందులో నియంత్రిత పద్ధతిలో శరీరంలోని కొద్దిపాటి కరెంట్‌ను ప్రవహించడం వల్ల రక్తనాళాల అంచులు తేలికగా కాలిపోతాయి. తద్వారా గాయం పూరించవచ్చు. కానీ విద్యుత్ ప్రవాహం కారణంగా గ్రెనైడ్ పేలవచ్చు.. కాబట్టి ఈ శస్త్రచికిత్సలో ఈ పని జరగలేదు.

గ్రెనైడ్ ఛాతీకి తగిలిన సైనికుడి వయసు 28 ఏళ్లు. అతడి ఛాతీలోకి దిగిన గ్రెనైడ్ గుండె దిగువన ఉంది. సర్జరీ అనంతరం ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సాధారణంగా వైద్యులు ఇలాంటి సర్జరీలు చేయరని హన్నా మలియార్ రాశారు. ఇది ఒక అద్భుత శస్త్రచికిత్స. ఇందులో రోగి ప్రాణం మాత్రమే కాకుండా, వైద్యుడు సైనిక సహాయంతో వైద్య సిబ్బంది ప్రాణాలను కూడా రక్షించాడు.

Grenade2

2006వ సంవత్సరంలో అమెరికా సైనిక వైద్యులు ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక అమెరికన్ సైనికుడి కడుపు నుండి లైవ్  గ్రెనైడ్ ను సేకరించారు. 2014లో కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ గర్భిణి తలలోంచి పేలుడు పదార్థాన్ని తొలగించారు. అటువంటి శస్త్రచికిత్సలో, శరీరంలో ఏ విధంగానైనా విద్యుత్తును నిర్వహించగల అటువంటి పరికరం ఉపయోగించబడదు. 2016 సంవత్సరం తర్వాత, US రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఇటువంటి శస్త్రచికిత్స చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..