నేరాలకు శిక్షగా నలుగురు వ్యక్తుల చేతులు నరికిన తాలిబాన్.. మరో 9మందిని బహిరంగంగానే..?

కొరడాలతో కొట్టడం, చేతులు, కాళ్లు నరికివేయడం, మరణశిక్ష విధించాలని వారు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలోనే బహిరంగ మైదానంలో వేలాది మంది ప్రజల సమక్షంలో దోపిడీకి పాల్పడినందుకు 4 వ్యక్తుల చేతులు నరికివేసి కఠినంగా శిక్షించారు.

నేరాలకు శిక్షగా నలుగురు వ్యక్తుల చేతులు నరికిన తాలిబాన్.. మరో 9మందిని బహిరంగంగానే..?
Taliban Publicly
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 18, 2023 | 5:31 PM

ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్ మహిళలు, మైనారిటీల హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా మహిళల ప్రాథమిక హక్కులను కాలరాయడానికి రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు. అంతేకాదు.. నారాలకు పాల్పడిన వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. కొరడాలతో కొట్టడం, చేతులు, కాళ్లు నరికివేయడం, మరణశిక్ష విధించాలని వారు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కాందహార్‌లోని అహ్మద్ షాహీ మైదానంలో వేలాది మంది ప్రజల సమక్షంలో దోపిడీకి పాల్పడినందుకు 4 వ్యక్తుల చేతులు నరికివేసి కఠినంగా శిక్షించారు.

అలాగే, వివిధ నేరాలకు పాల్పడిన తొమ్మిది మందిని కొరడాలతో కొట్టినట్టు గవర్నర్ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. దోషులకు 35-39 కొరడా దెబ్బలు కొట్టినట్టు సమాచారం. ఘటన జరిగినప్పుడు తాలిబన్ అధికారులు, మతపెద్దలు, స్థానిక ప్రజలు భారీగా మైదానంలోనే ఉన్నారు. అదేవిధంగా వివిధ నేరాలకు పాల్పడిన పలువురికి కొరడాలతో సహా శిక్షలు విధిస్తున్నారు. ఇలాంటి శిక్షలపై అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమైనా తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు.

ఇవి కూడా చదవండి

డిసెంబరులో, ఒక వ్యక్తిని చంపినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఉరితీశారు. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా ఉరితీయడం ఇదే తొలిసారి. కాగా, పశ్చిమ ఫరా ప్రావిన్స్‌లో బాధితురాలి తండ్రి దాడి రైఫిల్‌తో ఉరిశిక్షను వందలాది మంది ప్రేక్షకులు, చాలా మంది తాలిబాన్ అధికారులు ఇదంతా వీక్షించారు. ఆఫ్ఘన్‌లో చరిత్ర పునరావృతమవుతుంది. 1990ల మాదిరిగానే తాలిబాన్ బహిరంగ శిక్షను ప్రారంభించింది.. అంటూ నెటిజన్లు, మేధావులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!