Baby jain monk: 9 ఏళ్లకే సన్యాసినిగా మారిన కోటీశ్వరురాలు.. జైన సన్యాసిగా వజ్రాల వ్యాపారి గారాల తనయ..

ఇంతటి సంపన్నుడైన ధనేష్‌ గారాలపట్టి దేవాన్షి ఇప్పుడు వజ్రాల వ్యాపారుల కుటుంబం ఆమెకు అందించగలిగే అన్ని భౌతిక సౌకర్యాలు, విలాసాలను కాదనుకునని సన్యాసం పుచ్చుకుంది.

Baby jain monk: 9 ఏళ్లకే సన్యాసినిగా మారిన కోటీశ్వరురాలు.. జైన సన్యాసిగా వజ్రాల వ్యాపారి గారాల తనయ..
Baby Jain Monk
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 18, 2023 | 3:37 PM

అతడో సంపన్నుడు.. వజ్రాల వ్యాపారంలో సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్న కోటీశ్వరుడు..కానీ, అతని తొమ్మిదేళ్ల కుమార్తె భౌతిక సుఖాలను త్యజించి సన్యాసం స్వీకరించింది. ఈ ఘటన ఇప్పుడు యావత్‌ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ధనేష్‌-అమీబెన్‌ దంపతులు కుమార్తె దేవాన్షి జనవరి 18 బుధవారం ఉదయం 6 గంటలకు జైన సన్యాసం దీక్ష స్వీకరించింది. దేవాన్షి దీక్షా మహోత్సవం నాలుగు రోజుల క్రితం అంటే.. భోగీ పండగ రోజునే ప్రారంభమైంది. బుధవారం జైనాచార్య కీర్తియాశ్సూరీశ్వర్‌ మహరాజ్‌ సమక్షంలో దీక్ష చేపట్టింది. అంతకుముందు దేవాన్షీ వర్షిదన్‌ యాత్ర ముంబై, ఆంట్‌వెర్ప్‌లో కూడా జరిగింది.

Baby Jain Monk1

ఇకపోతే, ఈ చిన్నారి దీక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు సూరత్‌, పరిసర గ్రామాల నుంచి దాదాపు 35 వేల మంది తరలివచ్చారు. దేవాన్షీ వర్షిదన్‌ యాత్ర సూరత్‌లోనే జరిగింది. ఈ యాత్రలో 4 ఏనుగులు, 20 గుర్రాలు, 11 ఒంటెలను తరలించారు. అంతకుముందు దేవాన్షీ వర్షిదన్‌ యాత్ర ముంబై, ఆంట్‌వెర్ప్‌లో కూడా జరిగింది. ధనేష్, అమీ సంఘ్వీల ఇద్దరు కుమార్తెలలో పెద్దకూతురు దేవాన్షి,.. సూరత్‌లోని వెసు ప్రాంతంలోని ఒక వేదిక వద్ద జైన సన్యాసి ఆచార్య విజయ్ కీర్తియాష్సూరి, వందలాది మంది వ్యక్తుల సమక్షంలో ‘దీక్ష’ తీసుకుంది.

ఆమె తండ్రి సూరత్‌లో దాదాపు మూడు దశాబ్దాల నాటి నుండి డైమండ్ పాలిషింగ్, ఎగుమతి సంస్థ సంఘ్వి అండ్ సన్స్ యజమాని. ఇంతటి సంపన్నుడైన ధనేష్‌ గారాలపట్టి దేవాన్షి ఇప్పుడు వజ్రాల వ్యాపారుల కుటుంబం ఆమెకు అందించగలిగే అన్ని భౌతిక సౌకర్యాలు, విలాసాలను కాదనుకునని సన్యాసం పుచ్చుకుంది.

దేవాన్షి చాలా చిన్న వయస్సు నుండి ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపింది.ఇతర సన్యాసులతో కలిసి 700 కి.మీ నడిచింది. అధికారికంగా సన్యాసం స్వీకరించడానికి ముందు వారి జీవితాన్ని అనుభవించినట్టుగా కుటుంబ స్నేహితుడు నీరవ్ షా చెప్పారు. చిన్నారి దేవాన్షికి ఐదు భాషలు తెలుసని, ఇతర నైపుణ్యాలు కూడా ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..