Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇద్దరు మనుషులు తృప్తిగా టిఫిన్ చేసి.. కాఫీ తాగితే వచ్చిన బిల్లు చూస్తే అవాక్కే..! 1971నాటి బిల్లు వైరల్‌..

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ బిల్లు ఫోటోతో కూడిన ట్వీట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ..

Viral News: ఇద్దరు మనుషులు తృప్తిగా టిఫిన్ చేసి.. కాఫీ తాగితే వచ్చిన బిల్లు చూస్తే అవాక్కే..! 1971నాటి బిల్లు వైరల్‌..
Breakfast
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 17, 2023 | 9:08 PM

దేశ రాజధాని ఢిల్లీ చాలా సంవత్సరాలుగా ఆహార ప్రియులకు కేంద్రంగా నిలుస్తుంది. దక్షిణ భారత వంటకాల నుండి స్వదేశీ చోలే, భటోరీ వరకు దేశ రాజధానిలో అనేక రకాల వంటకాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అది కూడా చాలా సరసమైన ధరకు అందించబడుతున్నాయి.. కానీ తక్కువ ఖర్చుతో కూడిన వంటకాలు ఇటీవలి కాలంలో కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 1971 నాటి హోటల్‌ బిల్లు ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆనాటి హోటల్‌ బిల్లు ప్రకారం రెండు మసాలా దోసెలు, రెండు కప్పుల కాఫీ కలిపి అప్పటి బిల్లు కేవలం 2 రూపాయలు మాత్రమే. ఈ బిల్లు ఫిబ్రవరి 2017లో ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది. ఢిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్‌ బిల్లు రసీదు ఇది. తేదీ 28.06.1971. 2 మసాలా దోస & 2 కాఫీ 16 పైసల పన్ను కలుపుకుని మొత్తం బిల్లు రూ. 2.16 మాత్రమే! ఈ బిల్లు ఢిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్ నుండి వచ్చింది.  “28.6.71” నాటిది, అంటే ఇది 51 సంవత్సరాల పూర్వ కాలం నాటిది అన్నమాట.

ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, 1971లో రూ. 2 ఉంటే ఇప్పుడు ఒక వ్యక్తికి రూ.92 ఖర్చవుతుంది. కానీ నేడు, ఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో కేవలం ఒక సాదా దోసె తీసుకుంటే మామూలుగా రూ. 90 కంటే ఎక్కువ ఖర్చవుతుంది. రెండు మసాలా దోసెలు, రెండు కాఫీల ధర చాలా ఎక్కువ.

ఇవి కూడా చదవండి

గడిచిన 50 ఏళ్లలో ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా మన కరెన్సీ కొనుగోలు శక్తి కూడా తగ్గిందని ఈ బిల్లును చూస్తే అర్థమవుతుంది. కానీ, ఢిల్లీలో ఇప్పటికీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ లభించే దేశవ్యాప్తంగా రుచికరమైన వంటకాలను ప్రజలు ఆస్వాదిస్తుంటారు.

ఇకపోతే, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ బిల్లు ఫోటోతో కూడిన ట్వీట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. మసాలా దోస, కాఫీని అందించే పంజాబీ రెస్టారెంట్, అది కూడా 1971లోనా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

‘ఇండియన్ హిస్టరీ విత్ విష్ణు శర్మ’ పేరుతో గల అకౌంట్ నుంచి ట్వీట్ పోస్ట్ చేయబడింది. మన దేశంలోని చారిత్రక అంశాల గురించి పోస్ట్ చేయడంలో వీరి ట్విట్టర్‌ ఖాతా ప్రసిద్ధి. అత్యంత ఇటీవలి ట్వీట్ సోమపుర మహావిహార శిధిలాల గురించి, జనవరి 4న పోస్ట్ చేయబడింది. శీర్షిక ఇలా ఉంది – “సోమపుర మహావిహార శిధిలాలు, ఒకప్పుడు భారత ఉపఖండంలోని అతిపెద్ద మఠం,ఇప్పుడు బంగ్లాదేశ్‌లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. అని..

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది అద్భుతంగా ఉందని కొందరు అంటుంటే, 1971లో పంజాబీ రెస్టారెంట్ రెండు రూపాయలకే ఇంత భోజనం చేసి ఉంటుందా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ముందు కూడా 51 ఏళ్ల క్రితం రెండు మసాలా దోసెలు, రెండు కాఫీలు రూ.2.16 మాత్రమే. అది తెలిసి కూడా అదే సమయంలో మళ్లీ రాకూడదని నెటిజన్లు భావిస్తున్నారంటే అబద్ధం కాదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..