Viral Video: కదులుతున్న బస్సుకిందకు దూకి యువకుడు బలవన్మరణం.. సీసీ కెమెరాలో రిక్డారైన దృశ్యం వైరల్‌..

అది గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటినా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది.

Viral Video: కదులుతున్న బస్సుకిందకు దూకి యువకుడు బలవన్మరణం.. సీసీ కెమెరాలో రిక్డారైన దృశ్యం వైరల్‌..
Kondagaon
Follow us

|

Updated on: Jan 17, 2023 | 7:13 PM

ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ ఘటన కొండగావ్ బస్టాండ్‌లో జరిగినట్టుగా తెలిసింది. మృతుడు ఇర్గావ్‌కు చెందిన 40 ఏళ్ల బిస్నాథ్ దుగ్గగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బస్టాండ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆత్మహత్య చేసుకునేందుకు అతడు కదులుతున్న బస్సు వెనుక టైర్‌ కిందకు పరిగెత్తాడు. దీంతో అతడు బస్సు వెనుక చక్రం కింద పడ్డాడు. బిస్నాథ్ చక్రం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అది గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటినా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన కొండగావ్ బస్టాండ్‌లో జరిగింది. మృతుడు ఇర్గావ్ నివాసి 40 ఏళ్ల బిస్నాథ్ దుగ్గగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బస్టాండ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

బిస్నాథ్ రెండు రోజుల క్రితం కొండగావ్‌లోని బంధువుల ఇంటికి వచ్చినట్లు సమాచారం. తిరిగి ఇంటికి వచ్చేందుకు సోమవారం బస్టాండ్‌కు చేరుకున్నాడు. అయితే రాయ్‌పూర్ నుంచి జగదల్‌పూర్ వెళ్తున్న శర్మ ట్రావెల్స్ బస్సు కిందకు దూకాడు. బస్సు డ్రైవర్‌కు తెలియడంతో వెంటనే బ్రేకులు వేశాడు. కానీ అప్పటికి ఆలస్యమైపోయింది. తీవ్రంగా గాయపడిన బిస్నాథ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని కూడా పోస్టుమార్టంకు తరలించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..