Iron Deficiency: ఈ మూడు రకాల డ్రింక్స్‌తో శరీరంలో ఐరన్‌ లోపం సమస్యలకు చెక్‌..

శరీరంలో ఐరన్‌ లోపిస్తే చిన్న పని చేసినా అలసిపోతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి ఈ మూడు రకాల జ్యూస్‌లు చాలా బాగా పనిచేస్తాయి.

Iron Deficiency: ఈ మూడు రకాల డ్రింక్స్‌తో శరీరంలో ఐరన్‌ లోపం సమస్యలకు చెక్‌..
Iron Rich Drink
Follow us

|

Updated on: Jan 17, 2023 | 4:36 PM

మనం ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితంలో ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తింటున్నాం. పోషకాల కొరత కారణంగా శరీరం బలహీనపడటం ప్రారంభిస్తే, అది అనేక వ్యాధులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. శరీరానికి ఐరన్ కంటెంట్ చాలా ముఖ్యమైన అంశం. ఇనుము లోపం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. మన శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి ఐరన్‌ పనిచేస్తుంది. శరీరంలో ఐరన్‌ లోపిస్తే చిన్న పని చేసినా అలసిపోతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి ఈ మూడు రకాల జ్యూస్‌లు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.

బచ్చలికూర రసం: బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఇది మన శరీరానికి ఐరన్ సరఫరా చేయడంలో సహాయపడుతుంది. బచ్చలికూర రసానికి కొబ్బరి, నీళ్లు, జీడిపప్పు, పైనాపిల్ కలిపి తీసుకుంటే రుచి పెరుగుతుంది. ఈ జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. పీ ప్రోటీన్ షేక్ శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలో సాయపడుతుంది. ఈ జ్యూస్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇతర ప్రోటీన్ పౌడర్లతో పోలిస్తే బఠానీ ప్రోటీన్‌లో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. బఠానీ ప్రోటీన్ పౌడర్‌తో పానీయాన్ని .. షేక్ లేదా స్మూతీగా చేసుకోవచ్చు. తీపిగా ఉండేందుకు చక్కెర కలుపకుండా చూసుకోవాలి.

బీట్‌రూట్‌ జ్యూస్‌: బీట్‌రూట్ జ్యూస్ మరొక సాధారణ ఐరన్-రిచ్ డ్రింక్. బీట్‌రూట్‌లో ఐరన్‌ అధికంగా ఉండటమే కాకుండా, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, బీటైన్, విటమిన్ సీ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో ఉండే ఖనిజాలు రక్త కణాలను సరిచేయడానికి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో సాయపడతాయి. క్యారెట్, నారింజ లేదా ఉసిరిని కలుపుకోవడం ద్వారా బీట్‌రూట్ రసాన్ని మరింత రుచికరంగా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గుమ్మడికాయ రసం: గుమ్మడికాయ గింజలు ఐరన్‌కు గొప్ప మూలం. యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన ఖనిజాలను కూడా అందిస్తాయి. గుమ్మడికాయ గింజలతో జ్యూస్ లేదా స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఆహారంలో చేర్చుకుని కూడా తినొచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే