Viral Video: చుట్టూ కారు చీకట్లో బస్సు ప్రయాణం.. అకస్మత్తుగా అడ్డొచ్చిన ఏనుగులు.. ఏమైందంటే..!
వేగంగా వెళ్తున్న బస్సుకు తల్లి ఏనుగు, గున్నఏనుగు అడ్డుగా వచ్చింది.. చిమ్మ చీకట్లో డ్రైవర్ తన ప్రయాణాన్ని రికార్డు చేస్తుండగా అనూహ్యంగా ఏనుగులు రోడ్డు దాటుతుండటం ఆయన కంటపడింది. దీంతో అతడు వాహనాన్ని స్పీడ్..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో అనేకం జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. పులులు, సింహాలు, ఖడ్గమృగాలకు సంబంధించిన వీడియోలు నెటిజ్లను షాక్ గురిచేస్తుంటాయి. మరిన్ని జంతువులకు సంబంధించి విచిత్రమైన వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. నచ్చిన వీడియోలను ప్రజలు ఎక్కువగా లైక్ చేస్తుంటారు. మళ్లీ మళ్లీ చూస్తుంటారు. లైకులు, షేర్లు చేస్తూ ఎప్పటికప్పుడు వైరల్‌గా మార్చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడబోతున్న వైరల్ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోను కర్నాటక డెవలప్‌మెంట్ ఇండెక్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసి కొన్న గంటల్లోనే వేల సంఖ్యలో వ్యూస్, లైకులు సంపాదించింది. కేవలం 19 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో కర్నాటకలోని దండేలి ప్రాంతంలో రాత్రివేళ చిమ్మచీకటిగా ఉన్న రోడ్డుపై డ్రైవర్ తన వాహనంతో వెళుతుండటం కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే…
అది.. కర్ణాటకలోని బెంగళూరు దండేలి ప్రాంతం. రాత్రి వేళ చుట్టూ కమ్ముకున్న చీకటి,.. అటవీ ప్రాంతంగుండా ఓ బస్సు వెళుతోంది. ఇంతలోనే వాహనం ముందు నుంచీ ఓ ఏనుగు, దాని బిడ్డతో కలిసి రోడ్డు దాటుతుంది. వేగంగా వెళ్తున్న బస్సుకు తల్లి ఏనుగు, గున్నఏనుగు అడ్డుగా వచ్చింది.. చిమ్మ చీకట్లో డ్రైవర్ తన ప్రయాణాన్ని రికార్డు చేస్తుండగా అనూహ్యంగా ఏనుగులు రోడ్డు దాటుతుండటం ఆయన కంటపడింది. దీంతో అతడు వాహనాన్ని స్పీడ్ కంట్రోల్ చేస్తూ ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dandeli?? pic.twitter.com/alwqQWpAtA
— Karnataka Development Index (@IndexKarnataka) January 16, 2023
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి అనేక స్పందనలు వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ జంతువుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. దండేలిలో అటవీ విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోందని ఆరోపించారు. చుట్టూ ఉన్న మసీదుల నుండి పెద్ద శబ్దాలు శబ్ధాలు వస్తుండటం, అటవీ ప్రాంతం తగ్గిపోతుండటంతో ఇక్కడ సంచరించే మృగాలు, జంతువుల బాగోగులపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ కారిడార్ ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించడం ద్వారా మానవులు, వన్యప్రాణులకు సురక్షిత వాతావరణం కల్పించవచ్చని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..