AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డీజే చప్పుళ్లతో పెంపుడు కుక్కలకు అరెంజ్‌ మ్యారేజ్‌.. ధూమ్‌ధామ్‌గా బరాత్‌.. వీడియో వైరల్‌..

మకర సంక్రాంతి రోజున జనవరి 14న టామీ, జెల్లీల వివాహం నిశ్చయించారు. బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డీజే చప్పుళ్లతో బరాత్‌ తీస్తూ.. డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.

Viral Video: డీజే చప్పుళ్లతో పెంపుడు కుక్కలకు అరెంజ్‌ మ్యారేజ్‌.. ధూమ్‌ధామ్‌గా బరాత్‌.. వీడియో వైరల్‌..
Dog Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 16, 2023 | 4:38 PM

చాలా మంది పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలకు పుట్టిన రోజులు, పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. పెంపుడు కుక్కలకు వింతగా సీమంతం కూడా నిర్వహిస్తుంటారు. అలాంటి ఓ వింత ధోరణినికి సంబంధించిన సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో వెలుగు చూసింది. సాంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కలకు వివాహం జరిపించాడు ఓ యజమాని. మనుషుల పెళ్లి కోసం అమ్మాయి, అబ్బాయిని వెతికినట్టుగానే..ఇక్కడ కూడా వేరువేరు ప్రాంతాలకు చెందిన రెండు కుక్కలకు వివాహం నిశ్చయించారు వాటి యజమానులు. అనంతరం ఆచార సంప్రాదాయల ప్రకారం వాటికి పెళ్లి చేశారు. ఏడు నెలల ఆడ కుక్క జెల్లీకి టామీకి వేడుకగా పెళ్లి జరిపించాడు. టామీ సుఖ్రావలి గ్రామస్తుడైన దినేష్ చౌదరి పెంపుడు కుక్క. కాగా, జెల్లీ టిక్రీ రాయ్‌పూర్‌కు నివాసి డాక్టర్ రాంప్రకాష్ సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క.

మకర సంక్రాంతి రోజున జనవరి 14న టామీ, జెల్లీల వివాహం నిశ్చయించారు. అలీఘర్‌లోని సుఖ్రవలీ ప్రాంతానికి చెందిన దినేష్‌ చౌదరికి చెందిన టామీ (మగ కుక్క)కి.. టిక్రీ రాయ్‌పూర్‌కు చెందిన రాంప్రకాశ్‌ సింగ్‌కు చెందిన శునకం జెల్లీ (ఆడకుక్క)కి జనవరి 14వ తేదీన పెళ్లి వేడుక నిర్వహించారు. బాజా భజంత్రీలు, డీజే చప్పుళ్ల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం జరిపించారు.

వీరి పెంపుడు కుక్కల పెళ్లికి బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డీజే చప్పుళ్లతో బరాత్‌ తీస్తూ.. డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు ప్రశంసలు కామెంట్లు కుమ్మరించారు. వీడియోని లైక్‌ చేస్తూ..షేర్‌ చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..