AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Non-veg Food: ఇకపై క్యాంటీన్‌, హాస్టల్‌లలో మాంసాహారం నిషేదం..! ఎందుకంటే..

హాస్టళ్లు, క్యాంటీన్లలో మాంసాహారాన్ని నిషేదం. పైగా మాంసాహారం అందిస్తామనే హామీతో విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వలేదని యాజమాన్యం చెప్పడం.. విద్యార్ధుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లైంది..

Non-veg Food: ఇకపై క్యాంటీన్‌, హాస్టల్‌లలో మాంసాహారం నిషేదం..! ఎందుకంటే..
Non Veg Food
Srilakshmi C
|

Updated on: Jan 16, 2023 | 1:12 PM

Share

హాస్టళ్లు, క్యాంటీన్లలో మాంసాహారాన్ని నిషేదిస్తున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్‌ కాలేజ్‌ ప్రకటించింది. పైగా మాంసాహారం అందిస్తామనే హామీతో విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వలేదని కాలేజీ యాజమాన్యం చెప్పడం.. విద్యార్ధుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లైంది. నిజానికి గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఆఫ్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాలేజీ క్యాంటీన్‌, హాస్టల్‌లలో నాన్‌వెజ్‌ ఫుడ్‌ నిలిపివేశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్‌ రమా మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ వచ్చిన తర్వాత కాలేజ్‌ క్యాంటీన్‌, హాస్టళ్లలో మాంసాహారం అందించడం నిలిపివేశాం. దీంతో గత 3, 4 ఏళ్ల నుంచి నాన్‌వెజ్‌ పెట్టడం లేదు. ఐతే కమిటీ నిర్ణయం తీసుకునే ముందు విద్యార్ధులకు ఓ మాట చెప్పి ఉండాల్సింది. మాంసాహారం తినే విద్యార్ధులపై ఎటువంటి నిషేదం లేదు కాబట్టి తినాలను కునే వారు బయట తినవచ్చు. శాకాహారం మాత్రమే పెట్టాలనే నిర్ణయంపై ఇప్పటివరకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. మెజారిటీ విద్యార్ధుల నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని అడ్మిన్‌ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.

ఇక ఇదే విషయంపై గత ఏడాది జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్ధుల మధ్య ఘర్షనలు నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది శ్రీరామనవమి రోజున కాలేజీ క్యాంటీన్‌లో లెఫ్ట్‌ పార్టీ సానుభూతి పరులైన కొందరు విద్యార్థులు మాంసాహార భోజనం తింటుండగా ఏబీవీపీకి చెందిన విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఉద్దేశ పూర్వకంగానే శ్రీరామనవమినాడు మాంసాహారం వండించినట్లు ఏబీవీపీ ఆరోపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు హంసరాజ్‌ కాలేజ్‌ యాజమన్యం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?