AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిమ్‌ తో దోస్తీ గుర్తుకొచ్చి..దక్షిణ కొరియాతో తెగతెంపులు చేసుకున్న ట్రంప్‌

ట్రంప్ ఇరాన్ అణు నిరాయుధీకరణ ప్రతిపాదనను దక్షిణ కొరియా తిరస్కరించింది. ఇరాన్‌ విషయంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు దక్షిణ కొరియా ససేమిరా అంది. దాంతో అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. ఇరు దేశాలు చేపట్టబోయే సైనిక విన్యాసాలను రద్దు చేయలేక భారీగా తగ్గించారు.

కిమ్‌ తో దోస్తీ గుర్తుకొచ్చి..దక్షిణ కొరియాతో తెగతెంపులు చేసుకున్న ట్రంప్‌
Donald Trump With North Korea's Kim
Sharada V
|

Updated on: Aug 17, 2026 | 1:20 PM

Share

ఇరాన్ అణు నిరాయుధీకరణ ప్రతిపాదనను దక్షిణ కొరియా తిరస్కరించింది. ఇరాన్‌ విషయంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు దక్షిణ కొరియా అంగీకరించలేదు. దాంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాలను భారీగా తగ్గించారు. ఈ మేరకు అమెరికా రక్షణ రంగం పెంటగాన్‌కు ఆదేశాలు జారీ చేశారు.  ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్‌ను అణు నిరాయుధీకరణ చేసే అమెరికా ప్రయత్నాల్లో భాగస్వామి కావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ట్రంప్ కోరగా, సీయోల్ నుంచి “నో థ్యాంక్స్!” అని స్పష్టమైన సమాధానం వచ్చిందని ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.

అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలలో కోత

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ఉన్న బంధం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. కిమ్ తో తనకు “చాలా మంచి సంబంధాలు” ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో కొరియన్ ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి భారీ సైనిక విన్యాసాలు నిర్వహించడం ఉత్తర కొరియాకు అనుచిత సంకేతాలను పంపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు అత్యంత ఖరీదైనవనీ, వీటి ఖర్చులో అధిక భాగాన్ని అమెరికాయే భరిస్తోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ విన్యాసాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున వీటిని పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదని, కానీ వీటి పరిధిని తగ్గించాలని యూఎస్ వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్‌ను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న వేళ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న అమెరికా-దక్షిణ కొరియా భద్రతా బంధంలో ఈ పరిణామం ఒక కీలక మలుపుగా మారింది. తాజా పోస్ట్‌కు ఒక రోజు ముందు కిమ్‌తో 2019లో దిగిన ఫొటోను ట్రంప్‌ పంచుకున్నారు. జపాన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ కూడా ఇరాన్‌ విషయంలో అమెరికాకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంపై వెనుకంజ వేస్తున్నాయని ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమెరికా- దక్షిణ కొరియా ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్‌’ పేరుతో ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు ప్రకటించాయి. ఆగస్ట్ 17 నుంచి 11 రోజులపాటు ఇవి జరగనున్నాయి. ఇందులో 18 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. విన్యాసాలు షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతాయని సియోల్‌ ప్రకటించింది. గతంలో 2018లో కిమ్‌తో అణు చర్చలు జరిపిన సమయంలో కూడా ట్రంప్‌.. అమెరికా- దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను నిలిపివేశారు. తాజాగా కిమ్‌తో తనకు మంచి సంబంధాలున్నట్లు మాట్లాడటం, సైనిక విన్యాసాలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఉత్తర కొరియాతో చర్చలకు ట్రంప్‌ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us