Ajit Pawar Lift Accident: ‘తృటిలో తప్పించుకున్నా.. లేదంటే ఈ టైంకి టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చేది’

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత (ఎన్‌సీపీ) అజిత్ పవార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని పూణెలో హార్దికర్ హాస్పిటల్‌లో ఆయన ఎక్కిన లిఫ్ట్‌ 4వ అంతస్తు నుంచి..

Ajit Pawar Lift Accident: 'తృటిలో తప్పించుకున్నా.. లేదంటే ఈ టైంకి టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చేది'
NCP leader Ajit Pawar
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 16, 2023 | 10:00 AM

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత (ఎన్‌సీపీ) అజిత్ పవార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని పూణెలో హార్దికర్ హాస్పిటల్‌లో ఆయన ఎక్కిన లిఫ్ట్‌ 4వ అంతస్తు నుంచి పడిపోయింది. అదే లిఫ్ట్‌లో అజిత్ పవార్‌తోపాటు, ఓ డాక్టర్‌, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం అదేసమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆదివారం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని తన భార్య, తల్లికి కూడా చెప్పలేదన్నారు. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యేదన్నారు. జనవరి 14న పుణెలోని ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

‘ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో భవనం లోని మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యాం. అయితే మాతో పాటు 90 ఏళ్ల డాక్టర్‌ ఉండడంతో మేం లిఫ్ట్‌ ఎక్కాం. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్‌లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది. చుట్టూ చిమ్మచీకటి. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్‌ హఠాత్తుగా నాలుగో అంతస్తునుంచి కిందకు పడిపోయింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్‌ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు. ఆ తర్వాత డాక్టర్‌ను కాపాడాం. నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇదేదో కథకాదు. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజిది శ్రద్ధాంజలి కార్యక్రమంగా అయుండేది. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్‌ పవార్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.