Adiyogi Statue: 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించిన కర్ణాటక సీఎం.. భారీగా హాజరైన భక్తజనం

బెంగళూరు సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

Adiyogi Statue: 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించిన కర్ణాటక సీఎం.. భారీగా హాజరైన భక్తజనం
Adiyogi Statue
Follow us

|

Updated on: Jan 16, 2023 | 9:02 AM

బెంగళూరు సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆశ్రమానికి చేరుకుని ఆదియోగి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రులు డాక్టర్ కె.సుధాకర్, నగేష్, సిసి పాటిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ముఖ్యంగా ఆదియోగి విగ్రహంపై ఏర్పాటుచేసిన రంగురంగుల లేజర్‌ షో అందరినీ కట్టిపడేసింది. విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం శివుడిని అర్థం చేసుకుంటే, సృష్టిని అర్థం చేసున్నట్లే. మన సంస్కృతిని నిలబెట్టే కార్యకలాపాలకు మా ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో సంఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి ఆదియోగి కావాలి. ఈ విగ్రహావిష్కరణతో చిక్‌బళ్లాపూర్‌ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.

కాగా చిక్కబళ్లాపూర్‌లో ఇషా ఫౌండేషన్‌కు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆరోగ్య మంత్రి డాక్టర్ కె. సుధాకర్ తెలిపారు. అనంతరం సద్గురు జగ్గీ వాసుదేవ్‌ మాట్లాడుతూ చిక్‌బళ్లాపూర్‌ను అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారు. జీవించే మార్గాన్ని తెలుసుకుంటున్నారు. ‘నా తల్లి స్వస్థలం చిక్కబళ్లాపూర్. చిక్కండి పక్క కొండల్లో ఎక్కవగా అమ్మతోనే ఉన్నాను. ఆమె ఆధ్యాత్మిక, యోగా నిపుణురాలు.నా బాల్యమంతా చిక్‌బళ్లాపూర్‌లోనే గడిచింది. అయితే ఇప్పుడు కొందరు కొండ పేరును మార్చి తన సామాజిక కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆరోపించారు. కాగా విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటుచేసిన లేజర్‌ షో భక్తులను కట్టిపడేసింది. అలాగే సద్గురు జగ్గీ వాసుదేవ్ కుమార్తె రాధే భరతనాట్యంతో అలరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..