Waltair Veerayya: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న వీరయ్య ఊచకోత.. రెండో రోజులకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 13)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి వింటేజ్‌ లుక్‌ని చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. చిరు డ్యాన్స్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌కు తోడు కామెడీ కూడా జత కలవడంతో బాక్సాఫీస్‌ వద్ద వీరయ్యకు ఎదురుండడం లేదు.

Waltair Veerayya: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న వీరయ్య ఊచకోత.. రెండో రోజులకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Waltair Veerayya
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2023 | 4:47 PM

బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య ఊచకోత ఏ మాత్రం తగ్గడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ప్రస్తుతమున్న ఊపు కొనసాగితే మూడో రోజు ముగిసే నాటికే రూ.100 కోట్ల మార్క్‌ దాటేయడం ఖాయమని ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్, వీకెండ్‌ కావడంతో ఈ ఫీట్‌ సాధించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు ట్రేడ్‌ అనలిస్టులు. కాగా సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 13)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి వింటేజ్‌ లుక్‌ని చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. చిరు డ్యాన్స్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌కు తోడు కామెడీ కూడా జత కలవడంతో బాక్సాఫీస్‌ వద్ద వీరయ్యకు ఎదురుండడం లేదు. దీనికి తోడు మౌత్‌ టాక్‌ కూడా ఫుల్‌ పాజిటివ్‌గా రావడంతో సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఇదే బెస్ట్‌ అంటూ వీరయ్యకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రిలీజైన మొదటి రోజు రూ.55 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించిన మెగాస్టార్‌ సినిమా రెండో రోజూ తన హవా కొనసాగించింది. ఇక రెండో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ .75.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు కలిపి రూ. 55 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది వాల్తేరు వీరయ్య. ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తంలో రెండు కోట్ల 90 లక్షల షేర్, ఓవర్సీస్ లో ఆరు కోట్ల 15 లక్షల షేర్ సాధించింది. ఆ లెక్కన చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల 90 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా 75 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది.కాగా సినిమా ఓవరాల్ గా 88 కోట్లు బిజినెస్ చేయడంతో 89 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇంకా సినిమాకి 45 కోట్ల 10 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పండుగ సీజన్ సినిమాకు కలిసి రావడంతో పాటు పాజిటివ్ టాక్ కూడా రావడంతో టార్గెట్‌ రీచ్‌ కావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటించిన విషయం తెలిసిందే. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..