AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varalakshmi Sarathkumar : మా నాన్న పేరు చెప్పుకొని ఏ ఒక్క అవకాశం అందుకోలేదు.. వరలక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది.

Varalakshmi Sarathkumar : మా నాన్న పేరు చెప్పుకొని ఏ ఒక్క అవకాశం అందుకోలేదు..  వరలక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Varalakshmi Sarath Kumar
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2023 | 4:39 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఒక్క సారి క్రేజ్ తెచ్చుకుంటే దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కానీ తాను మాత్రం అలా కాదు అంటోంది వర్సటైల్ నటి వరలక్ష్మి. శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అయితే వరలక్ష్మికి సరైన గుర్తింపు తెచ్చింది మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే.. ముఖ్యంగా మన దగ్గర క్రాక్ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో వరలక్ష్మీ జయమ్మ అనే పాత్రలో కనిపించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో వరలక్ష్మీ అద్భుతంగా నటించి మెప్పించింది.

ఇక ఈ సినిమా తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో బిజీగా మారిపోయారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి సినిమాలోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది వరలక్ష్మీ. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇటీవల వరలక్ష్మీ మాట్లాడుతూ.. ఇక పై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే నటిస్తానని అన్నారు. ఇక పై గ్లామర్ రోల్స్ లో నటించనని అన్నారు. తాను గ్లామరస్ పాత్రలకు సూట్ అవ్వనని అలాంటి పాత్రలు చేయడానికి చాలామంది ఉన్నారని తెలిపింది వరలక్ష్మీ. తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ.. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. అందువల్లనే నేను యాక్టింగ్ వైపు వెళతానని నాన్నతో చెప్పాను. ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని చెప్పేసి నాన్న వద్దన్నారు అని తెలిపింది. నేను పట్టుబట్టి నాన్నను ఒప్పించాను. సినిమాల్లోకి వచ్చిన తరువాత నాకు ఫలానా ప్రాజెక్టులో ఛాన్స్ ఇప్పించమని నాన్నను ఎప్పుడూ అడగలేదు. శరత్ కుమార్ కూతురుగా కాకుండా వరలక్ష్మిగా నాకు అవకాశాలు ఇవ్వమని నేను నిర్మాతలకు చెప్పాను.. మా నాన్న పేరు ఎక్కడా వాడుకోలేదు అని తెలిపారు.