Kantara: టీవీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. బుల్లితెరపై కాంతార ప్రభంజనం.. ఎప్పుడంటే..

కాంతార సినిమాను ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, హిందీలో రిలీజ్ చేయగా.. అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన కాంతార చిత్రానికి అదే స్థాయిలో ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.

Kantara: టీవీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. బుల్లితెరపై కాంతార ప్రభంజనం.. ఎప్పుడంటే..
Kantara
Follow us

|

Updated on: Jan 15, 2023 | 4:41 PM

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది కాంతార. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కర్ణాటక ఆదివాసీల ఆచార సంప్రదాయ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి దర్శకత్వం.. నటనకు భారతీయులు ఫిదా అయ్యారు. ముందుగా కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార సినిమాను ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, హిందీలో రిలీజ్ చేయగా.. అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన కాంతార చిత్రానికి అదే స్థాయిలో ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.

ఈ సినిమా టెలికాస్ట్ హక్కులను ప్రముఖ ఛానల్ స్టార్ మా కొనుగోలు చేసింది. ఈ సినిమాను జనవరి 22న ఆదివారం సాయంత్రం స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో.. ఓటీటీలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే కాంతార సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు టెలివిజన్‏లో రాబోతుండడంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది. ఇక ఈ సినిమాను ఆస్కార్ కు నామినేట్ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను కాంతార సినిమా 95ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు టీఎస్పీయస్సీ కీలక అప్‌డేట్..
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు టీఎస్పీయస్సీ కీలక అప్‌డేట్..
ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఇలా చేస్తే సమస్యలన్నీ హాంఫట్
ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఇలా చేస్తే సమస్యలన్నీ హాంఫట్
ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్..
చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్..
ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి..
ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి..
మొదలైన పుష్పాగాడి రూల్.!| ఆత్మతో ప్రేమ.. ఆశిష్‌ కు వర్క్ అవుట్.?
మొదలైన పుష్పాగాడి రూల్.!| ఆత్మతో ప్రేమ.. ఆశిష్‌ కు వర్క్ అవుట్.?
జనాల ‘పల్స్’ పట్టిన స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు రెడీ..
జనాల ‘పల్స్’ పట్టిన స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు రెడీ..
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.. కూటమి మేనిఫెస్టోపై సజ్జల కౌంటర్.
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.. కూటమి మేనిఫెస్టోపై సజ్జల కౌంటర్.
కాంతార ఎ లెజెండ్ కోసం భారీ ప్లానింగ్.! బొమ్మ దద్దరిపోతుంది.
కాంతార ఎ లెజెండ్ కోసం భారీ ప్లానింగ్.! బొమ్మ దద్దరిపోతుంది.
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే