Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: జీవితానికి ఆటంకంగా నిలిచే అన్నింటి నుంచి ఉపశమనం.. మనస్సులోని భావోద్వేగాలన్ని దూరం.. సమంత పోస్ట్ వైరల్..

చాలా రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇటీవల శాకుంతలం మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో మీడియా ముందుకు వచ్చింది. డైరక్టర్ గుణశేఖర్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లుగా మసనులో దాగిన బాధను కన్నీళ్లుగా బయటకు తీసుకువచ్చింది.

Samantha: జీవితానికి ఆటంకంగా నిలిచే అన్నింటి నుంచి ఉపశమనం.. మనస్సులోని భావోద్వేగాలన్ని దూరం.. సమంత పోస్ట్ వైరల్..
Samantha 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2023 | 3:50 PM

సమంత.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయలో పడేసింది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాల్లో కనిపించిన సామ్.. తన నటనపరంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కథానాయికగా అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సామ్ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు. హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఓవైపు విడాకుల అనంతరం ఒంటరిగా మానసిక సంఘర్షణతో సతమతమైంది సామ్. కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు.. సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఆ తర్వాత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెరపై సందడి చేసింది. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ గడుపుతున్న సమయంలోనే మయోసైటిస్ సమస్య భారిన పడింది. దీంతో కొద్దిరోజులుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

చాలా రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇటీవల శాకుంతలం మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో మీడియా ముందుకు వచ్చింది. డైరక్టర్ గుణశేఖర్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లుగా మసనులో దాగిన బాధను కన్నీళ్లుగా బయటకు తీసుకువచ్చింది. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామ్.. తన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతుంది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో సామ్ లుక్స్ చూసి షాకయ్యారు అభిమానులు. మరికొందరు మాత్రం ఆమె లుక్ పై ట్రోల్ చేయగా.. వారికి తనస్టైల్లో కౌంటరిచ్చింది. ఇక ఇప్పుడు సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తున్న పోస్ట్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శుక్రవారం మార్పు ప్రతి వ్యక్తి స్థాయిలో జరగాలని.. అంతర్గంతంగా మనస్సులో ముందు కదలిక రావాలంటూ ఓ కోట్ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి
Samantha

Samantha

ఇక తాజాగా సద్గురు కోట్ షేర్ చేసింది. ఈ రోజు మీకు ఉపయోగపడని అన్నింటిని క్లియర్ చేయండి. మీ ఇంటిలో, మనస్సులోని అన్ని భావోద్వేగాలను విడిచిపెట్టండి. మీ జీవిత అనుభవానికి ఆటంకం కలిగించే అన్నింటి నుండి దూరంగా వచ్చి ఈరోజు కొత్తగా ప్రారంభించండి అంటూ సద్గురు చెప్పిన కోట్ షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఈ నోట్ వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.