AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara: విడుదలకు ముందే నాని ‘దసరా’ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

ఇటీవలే దసరా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది.

Dasara: విడుదలకు ముందే నాని 'దసరా' సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..
Dasara Movie
Rajitha Chanti
|

Updated on: Jan 14, 2023 | 3:15 PM

Share

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. సింగరేణి నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో నానికి జోడిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఇటీవలే దసరా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సెట్స్ నుంచి కీర్తిసురేష్ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలయ్యాయి. ముఖ్యంగా నాని లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్ ముగిసిన తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దసరా పోస్టర్ ను షేర్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత నాని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారు. నాని 30 సినిమాకు నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే