AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Moong Dal Ladoo: పెసరపప్పు అంటే కూరకే అనుకుంటున్నారా?.. లడ్డూలుగా చేస్తే రుచి అదిరిపోతుంది!

సాధారణంగా లడ్డూలు అంటే శనగపిండి, రవ్వ, బూందీ వంటి పదార్థాలతో తయారు చేస్తుంటారు. కానీ కాస్త వెరైటీగా, పోషకాలు ఉండే స్వీట్‌ తయారు చేసుకోవాలనుకుంటే పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే లడ్డూలు మంచి ఎంపిక. పెసరపప్పును బాగా వేయించి పొడి చేసి, డ్రై ఫ్రూట్స్‌, నెయ్యి వంటి పదార్థాలతో కలిపి తయారు చేసే ఈ లడ్డూలు రుచిగా ఉండటంతో పాటు సులభంగా తయారవుతాయి.

Green Moong Dal Ladoo: పెసరపప్పు అంటే కూరకే అనుకుంటున్నారా?.. లడ్డూలుగా చేస్తే రుచి అదిరిపోతుంది!
Green Moong Dal Ladoo
Bhavani
|

Updated on: Aug 10, 2026 | 7:43 PM

Share

ఇంట్లో పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా ఇవ్వడానికి లేదా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో స్వీట్‌గా చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. మరి ఈ హెల్తీ పెసరపప్పు డ్రై ఫ్రూట్ లడ్డూలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

పెసరపప్పు – 1 కప్పు

బాదం – ¼ కప్పు

జీడిపప్పు – ¼ కప్పు

ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్లు

నెయ్యి – 3–4 టేబుల్ స్పూన్లు

బెల్లం పొడి – ¾ కప్పు

యాలకుల పొడి – ½ టీస్పూన్

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును నీళ్లు పోయకుండా కడాయిలో వేసి తక్కువ మంటపై మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. పప్పు లైట్‌గా రంగు మారిన తర్వాత స్టవ్‌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన పెసరపప్పును మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తర్వాత బాదం, జీడిపప్పులను కూడా చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ను తేలికగా వేయించాలి.

ఇప్పుడు అదే కడాయిలో పెసరపప్పు పొడి వేసి కొద్దిసేపు నెయ్యితో కలుపుతూ వేయించాలి. మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్‌ ఆఫ్ చేయాలి. ఇందులో బెల్లం పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి బాగా కలపాలి.

మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని కావాల్సిన పరిమాణంలో ఉండలు చుట్టాలి. అంతే.. హెల్తీ పెసరపప్పు డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ!

చిట్కా: లడ్డూలు చుట్టేటప్పుడు మిశ్రమం పొడిగా అనిపిస్తే కొద్దిగా కరిగించిన నెయ్యి వేసి కలపాలి. ఎక్కువ నెయ్యి వేయకుండా అవసరమైనంత మాత్రమే ఉపయోగిస్తే లడ్డూలు మంచి ఆకారంలో వస్తాయి

Follow Us