AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సిటీలో సీరియల్ కిల్లర్.. ఒక్క క్లూ కూడా దొరక్కుండా హత్యలు.. OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం ఏ భాషలో చూసినా సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలదే హవా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. అలా రీసెంట్ గా ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

OTT Movie: సిటీలో సీరియల్ కిల్లర్.. ఒక్క క్లూ కూడా దొరక్కుండా హత్యలు.. OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 10, 2026 | 7:53 PM

Share

ప్రతీ వారం లానే ఈ వారం కూడా ఓటీటీల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయనున్నాయి. సుమారు 20కు పైగా సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. రష్మిక మందన్నా ‘కాక్ టెయిల్ 2’, కంగనా రనౌత్ భారత భాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు సినిమా కూడా ఈ వీకెండ్ లో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించనుంది. అయితే గత వారం సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా ఇప్పుడు సదరు ఓటీటీ ట్రెండింగ్ ఛార్ట్ లో టాప్ 10లో కొనసాగుతోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఉన్నట్లుండి నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. క్రిమినల్ ఎవరో కానీ ఒక్క క్లూ దొరక్కుండా ఈ మర్డర్స్ చేస్తుంటాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటారు. దీంతో ఈ సీరియల్ మర్డర్స్ మిస్టరీని ఛేదించేందుకు ఒక స్పెషలాఫీసర్ రంగంలోకి దిగుతాడు. మరి ఈ హత్యలు చేసింది ఎవరు? అసలు ఈ క్రిమినల్ మోటివ్ ఏంటి? ఒక్క క్లూ కూడా దొరక్కుండా ఎలా మర్డర్స్ చేస్తున్నాడు? పోలీసుల విచారణలో ఏం తేలింది? చివరకు ఆ క్రిమినల్ ను ఎలా పట్టుకున్నారు? అన్నది తెలియాలంటే ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు పంచనామా (Panchanama). సిగతాపు రమేష్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో జాన్ రమేష్, ప్రజ్ఞా రెడ్డి, కె దినేష్, హేమ సుధ, అపూర్వ శ్రీనివాసన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హార్దిక క్రియేషన్స్ బ్యానర్‌పై గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం పంచనామా సినిమా కేవలం రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఉచితంగా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావొచ్చు.

పంచనామా సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు
అబ్బా... పెసరపప్పుతో డ్రై ఫ్రూట్ లడ్డూలు.. రుచి ఇంత బాగుంటుందా..
అబ్బా... పెసరపప్పుతో డ్రై ఫ్రూట్ లడ్డూలు.. రుచి ఇంత బాగుంటుందా..
తెలంగాణలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!
తెలంగాణలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!
12.25% వరకు ప్రభావవంతమైన రాబడి.. ICL Fincorp NCD ఇష్యూ ప్రారంభం
12.25% వరకు ప్రభావవంతమైన రాబడి.. ICL Fincorp NCD ఇష్యూ ప్రారంభం
పిల్లల ఎత్తును పెంచే కమ్మటి హల్వా.. వారం రోజులు నిల్వ ఉండటం పక్కా
పిల్లల ఎత్తును పెంచే కమ్మటి హల్వా.. వారం రోజులు నిల్వ ఉండటం పక్కా
కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు..
కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు..
5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్
5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్
రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!
రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!