Viral Video: థమన్‌ పాటకు కడుపులో బిడ్డ స్టెప్పులు.. నెట్టింట వైరలవుతోన్న వీడియో

సినిమా ప్రముఖులు, యూట్యూబర్ లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు... ఇలా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంజితమే పాటకు స్టెప్పులేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

Viral Video: థమన్‌ పాటకు కడుపులో బిడ్డ స్టెప్పులు.. నెట్టింట వైరలవుతోన్న వీడియో
Ranjithame Song
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2023 | 8:56 PM

రంజితమే.. రంజితమే.. గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న పాట ఇది. కోలీవుడ్ స్టార్‌ హీరో వారిసు (తెలుగులో వారసుడు) సినిమాలోని ఈ పాట యూట్యూబ్‌ రికార్డులను కొల్లగొడుతోంది. ఇక వాట్సప్‌ స్టేటస్‌లు, యూట్యూబ్‌ షార్ట్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, ఫేస్‌బుక్‌.. ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీక్రియేషన్లే కనిపిస్తున్నాయి. సినిమా ప్రముఖులు, యూట్యూబర్ లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు… ఇలా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంజితమే పాటకు స్టెప్పులేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే రంజితమే పాటకు సంబంధించి ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ హుషారైన పాటకు పుట్టబోయే బిడ్డ కూడా గెంతులు వేస్తోంది. రంజితమే సాంగ్‌ తమ ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకంగా నిలిచిందంటూ తమిళనాడుకు చెందిన ఓ ఫ్యామిలీ స్పెషల్ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో ఓ మహిళ బేబీ బంప్‌తో నవ్వులు చిందిస్తూ కనిపించింది. అయితే రంజితమే పాటను ప్లే చేయగా ఆమె కడుపులోని బిడ్డ గెంతులేస్తున్నట్లు కదలికలు కనిపిస్తున్నాయి. ‘రంజితమే సాంగ్‌ పెట్టిన ప్రతిసారీ నా బేబీ ఇలాగే డ్యాన్స్‌ చేస్తోంది’’ అంటూ ఆ మహిళ మురిసిపోయింది ,కాగా ఈ వీడియోపై సంగీత దర్శకుడు తమన్‌ కూడా స్పందించాడు .

‘ఈ వీడియో చూస్తుంటే మధురానుభూతికి లోనవుతున్నాను. నా రోజును ఇది ఎంతో సంతోషంగా మార్చేసింది’ అని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వారిసు సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజైంది. తెలుగు వెర్షన్‌ను మాత్రం ఇవాళ (జనవరి 14)న విడుదల చేశారు. సినిమాలోని పాటలు చార్ట్‌బస్టర్‌ అయ్యాయని, విజయ్‌, రష్మిక స్టెప్పులు అదిరిపోయాయని ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..