- Telugu News Photo Gallery Cricket photos Team india Women Cricketer Veda Krishnamurthy gets married with Karnataka cricketer Arjun Hoysala on her mother's birth anniversary
తల్లి పుట్టినరోజునే పెళ్లిపీటలెక్కిన టీమిండియా మహిళా క్రికెటర్.. కర్ణాటక ప్లేయర్‌తో కలిసి ఏడడుగులు.. ఫొటోలు వైరల్
టీమిండియా మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తన జీవితంలోని కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కర్ణాటక క్రికెటర్ అర్జున్ హొయసలాతో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ ఇప్పుడు కోర్టు మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు.
Updated on: Jan 13, 2023 | 9:30 PM

టీమిండియా మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తన జీవితంలోని కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కర్ణాటక క్రికెటర్ అర్జున్ హొయసలాతో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ ఇప్పుడు కోర్టు మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు.

2021 జూలైలో వేదా కృష్ణమూర్తి ఇంట్లో కరోనా వైరస్ కారణంగా రెండు విషాదాలు జరిగాయి. కరోనా బారిన పడి తొలుత ఆమె తల్లి ప్రాణాలు కోల్పోగా, నాలుగు వారాల వ్యవధిలోనే అక్క కూడా ప్రాణాలు కోల్పోయింది.

ఇప్పుడు వారిద్దరిని గుర్తు చేసుకుంటూ తల్లి పుట్టినరోజునే అర్జున్‌ను వివాహం చేసుకుంది వేద కృష్ణమూర్తి. గత ఏడాది సెప్టెంబర్‌లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారీ క్యూట్ కపుల్

'మిస్టర్ అండ్ మిసెస్ లవ్. అమ్మ నీకోసమే ఇది. నీ పుట్టినరోజు ఎప్పటికీ నా స్పెషల్‌గా గుర్తుండిపోతుంది. లవ్ యూ అక్క... జస్ట్ మ్యారీడ్' తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది వేదా కృష్ణమూర్తి.

2011లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వేదా కృష్ణమూర్తి ఇప్పటివరకు 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. ఇక అర్జున్ విషయానికొస్తే.. 2016లో కర్ణాటక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ప్రస్తుతం వేద- అర్జున్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




