Ram Charan: ఆ విషయంలో ఉపాసన ముందే నాన్న తిట్టారు.. ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసిన రామ్ చరణ్
పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన రామ్‌చరణ్‌ని ఇడియట్ అని గట్టిగా తిట్టారట మెగాస్టార్ చిరంజీవి. అది కూడా చెర్రీ సతీమణి ఉపాసన కొణిదెల ఎదురుగానే. ఓ అంతర్జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెర్రీనే ఈ విషయాన్ని బయటపెట్టాడు.
ఓవైపు కలెక్షన్లు, మరోవైపు అవార్డులు, పురస్కారాలు గెల్చుకుంటూ చరిత్ర తిరగరాస్తోంది రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా. ఇందులోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. దీంతో ఫుల్‌జోష్‌లో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలాగే శంకర్ దర్శకత్వంలో RC15 మూవీని త్వరగా పూర్తి చేసే పనిలో కూడా ఉన్నాడు. అలాగే ఈ ఏడాదిలోనే ఉప్పెన ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. వీటితో పాటు మరో రెండు పెద్ద ప్రాజెక్టులు చెర్రీ చేతిలో ఉన్నాయి. కాగా పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన రామ్‌చరణ్‌ని ఇడియట్ అని గట్టిగా తిట్టారట మెగాస్టార్ చిరంజీవి. అది కూడా చెర్రీ సతీమణి ఉపాసన కొణిదెల ఎదురుగానే. ఓ అంతర్జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెర్రీనే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘ఓ రోజు డాడీతో కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లాను. నన్ను కిందకీ పైకి చూసిన నాన్న.. బరువు తగ్గిపోయావేంట్రా? అని అడిగారు. దాంతో ‘అవును డాడీ’ అంటూ నేను తలూపాను. ఆయన వెంటనే కోపంగా ఇడియట్ నేనేదో సరదాగా అడిగాను. ఇప్పటికే చాలా బరువు పెరిగావు. నీ శరీరం గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? వెంటనే జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు డైనింగ్ టేబుల్ వద్ద నా పక్కనే ఉపాసన కూడా కూర్చుని ఉంది. దీంతో ఆమె నొచ్చుకున్నట్లు.. మీ నాన్న గారు ఇలా మాట్లాడుతున్నారేంటి? అని నా వైపు చూసింది’
‘నటుడిగా శరీరాకృతిపై చాలా శ్రద్ధ అవసరం. నాన్న దాదాపు 4 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. డైట్ విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఇదే విషయాన్ని ఆ తర్వాత ఉపాసనకి చెప్పాను. నటుల మధ్య మాటలు ఇలానే ఉంటాయి అని ఉపాసనకు వివరించాను’ అని చెప్పుకొచ్చాడు చెర్రీ. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడ. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిన్నారు. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ బాణీలు సమకూరుస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..