Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhruva Sarja:నెల రోజుల్లో 18 కిలోల బరువు తగ్గిన స్టార్‌ హీరో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడుగా..

పొగరు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన కన్నడ స్టార్‌ హీరో ధ్రువ్‌ సర్జా. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ ఓరియంటెడ్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించింది.

Dhruva Sarja:నెల రోజుల్లో 18 కిలోల బరువు తగ్గిన స్టార్‌ హీరో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడుగా..
Dhruva Sarja
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2023 | 2:47 PM

పొగరు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన కన్నడ స్టార్‌ హీరో ధ్రువ్‌ సర్జా. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ ఓరియంటెడ్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన ‘కేడీ-ది డెవిల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. భారీకాయంతో ఎప్పుడూ నిండుగా కనిపించే ధ్రువ్‌ ఈ సినిమా కోసం స్లిమ్‌గా మారిపోయాడు. ఏకంగా 18 కిలోలో బరువు తగ్గిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘కేవలం నెల రోజుల వ్యవధిలో 18 కిలోలు తగ్గాను. కేడీ- ది డెవిల్‌ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి. జైహనుమాన్ ‘ అని ట్వీట్‌ చేశాడు ధ్రువ్. కేడీకి ముందు.. తర్వాత అంటూ నెట్టింట షేర్ చేసిన ఈ స్టిల్స్ ఇపుడు వైరలవుతున్నాయి. కన్నడలో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ను పంపిణీ చేసిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని కేడీ సినిమాను తెరకెక్కిస్తోంది. షోమ్యాన్‌ ప్రేమ్స్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్‌ జన్య సంగీతం అందిస్తున్నారు. కన్నడతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

కాగా గతేడాది గుండెపోటుతో మరణించిన కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా సోదరుడే ఈ ధ్రువ్‌. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 2012లో అధూరి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన సోదరుడు చిరంజీవి తరహాలోనే మాస్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తన పొగరు సినిమాను కన్నడతో పాటు తెలుగులోకి డబ్‌ చేసి సక్సెస్‌ కొట్టాడు. ప్రస్తుతం ఇతని చేతిలో కేడీతో పాటు మార్టిన్‌ అనే సినిమాకూడా ఉంది. ఇక తన వెయిట్‌లాస్ సీక్రెట్‌ విషయానికొస్తే.. స్ట్రిక్ట్‌ డైట్‌ను కచ్చితంగా ఫాలో అయ్యారట. అలాగే క్రమం తప్పకుండా వర్కవుట్లు చేశారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..