AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balayya Fan: సినిమా చెత్తలా ఉందన్న వ్యక్తిని కొట్టేందుకు కూల్‌డ్రింక్ బాటిల్‌తో లోనికి.. లోపల జరిగింది ఇదే

థియేటర్ లోపల ఏం జరిగిందో చెప్పండ్రా బాబు. ప్రజంట్ వైరల్ అవుతున్న బాలయ్య ఫ్యాన్ వీడియోను చూసి నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ ఇదే. వారి కోసమే ఈ క్లారిటీ..

Balayya Fan: సినిమా చెత్తలా ఉందన్న వ్యక్తిని కొట్టేందుకు కూల్‌డ్రింక్ బాటిల్‌తో లోనికి.. లోపల జరిగింది ఇదే
Nandamuri Balakrishna Fans
Ram Naramaneni
|

Updated on: Jan 13, 2023 | 3:33 PM

Share

నందమూరి బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఈ గురువారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వీరసింహారెడ్డి సినిమా. ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్‌ను, మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తమకు పండగ ముందే వచ్చిందని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా బాలయ్య డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్, థమన్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ హైలెట్స్ అని చెబుతున్నారు. బాలయ్య చెల్లెలిగా వరలక్ష్మి శరత్‌కుమార్ రోల్ అద్భుతంగా పండిందని చెబుతున్నారు. కాగా సినిమా విడుదల రోజున  ఉదయం 4 గంటలకే షో వేసుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది. దీంతో ఫ్యాన్స్ రాత్రి నుంచే రచ్చ చేశారు. అయితే, ఈ సినిమా రిలీజ్‌ నేపథ్యంలోనే హైదరాబాద్‌‌లోని ఓ థియేటర్లో ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది.

బెనిఫిట్ షో ఫస్ట్ హాఫ్ చూసిన బయటకు వచ్చిన ఓ అభిమాని యూట్యూబ్ చానల్స్‌కు రివ్యూ ఇస్తూ పూనకాలతో ఊగిపోయాడు. సినిమా అదిరిపోయిందని నభూతో నభవిష్యతీ అనే రేంజ్‌లో ఉందంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతడికి ఒక్కసారిగా కోపం తెప్పించాడు తోటి ప్రేక్షకుడు. మైక్ ముందు మాట్లాడుతుండగా పక్కకు వచ్చి సినిమా చెత్తలా ఉందని కామెంట్ చేశాడు. దీంతో రివ్యూ చెబుతున్న ఫ్యాన్ ఒక్కసారిగా సీరియస్ లుక్ ఇచ్చాడు. ఆ తోటి ప్రేక్షకుడు  ‘ఆ లుక్ ఏంటి’ అని అక్కడి నుంచి గేలి చేసి వెళ్ళిపోయాడు. దీంతో కోపం పట్టలేని ఆ ఫ్యాన్ అతడిని కొట్టడానికి అన్నట్టుగా ఓ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని థియేటర్లోకి పరిగెత్తాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.  కాగా ఆ ఫ్యాన్ లోపలికి వెళ్లి ఏమి చేసి ఉంటాడో అని చర్చించుకుంటున్నారు.

అయితే అతడు లోనికి వెళ్లి ఏం చేయలేదు. గమ్మున తన సీట్లో కూర్చోని సెకండాఫ్ సినిమా చూశాడు. పనిలో పనిగా లోనికి పట్టుకెళ్లిన కూల్‌డ్రింక్ తాగేశాడట. ఇదే విషయాన్ని అతడితో సినిమా చూసిన తోటి ప్రేక్షకులు కన్ఫామ్ చేశారు. అంతేకాదు.. సినిమా అయ్యాక సదరు యూట్యూబ్ చానల్స్ వారు లోపల ఏం చేశావ్ అని అడుగాతారేమో అని కనపడకుండా జారుకున్నాడట. మరి ఏం చేస్తాడు.. అతనేమో ఒక్కడే ఉన్నాడు.. వారేమో పెద్ద గ్యాంగ్‌లా ఉన్నారు. పెట్టుకుంటే మడతెట్టేస్తారు. మొత్తానికి అతడు గొడవ పడకుండా తెలివైన పనే చేశాడు లేండి. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా..!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..