Netflix: సినీప్రియులకు చిత్రాల జాతర తెస్తోన్న నెట్‏ఫ్లిక్స్.. ఒక్కరోజే ఎన్నో సినిమాలు అనౌన్స్ చేసిందో చూశారా ?..

చిన్న సినిమాలే కాదు.. స్టార్ హీరోస్ మూవీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించి సినీ ప్రియులకు సంక్రాంతి కానుక ఇచ్చింది. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న దసరా సినిమా థియేట్రికల్ రన్ అనంతరం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Netflix: సినీప్రియులకు చిత్రాల జాతర తెస్తోన్న నెట్‏ఫ్లిక్స్.. ఒక్కరోజే ఎన్నో సినిమాలు అనౌన్స్ చేసిందో చూశారా ?..
Netflix Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2023 | 9:40 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల సందడి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ పండగ జోష్ ముందే తీసుకువచ్చారు. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఇటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని మేము కూడా అందిస్తామంటూ ముందుకు వచ్చేసింది ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్. ఒక్కరోజే వరుస చిత్రాలను అనౌన్స్ చేసి సినిమాల జాతర తీసుకువస్తున్నట్లు తెలిపింది. చిన్న సినిమాలే కాదు.. స్టార్ హీరోస్ మూవీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించి సినీ ప్రియులకు సంక్రాంతి కానుక ఇచ్చింది. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న దసరా సినిమా థియేట్రికల్ రన్ అనంతరం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అలాగే మరికొన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. అవెంటో తెలుసుకుందామా.

ఇటీవల యంగ్ హీరో నిఖిల్.. అనుపమ నటించిన 18 పేజెస్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అలాగే.. నాగశౌర్య నటిస్తోన్న కొత్త సినిమాతోపాటు.. మీటర్, కార్తీకేయ కొత్త చిత్రం.. రవితేజ ధమాకా, నాని దసరా, అర్జున్ దాస్ నటించిన బుట్టబొమ్మ, కళ్యాణ్ రామ్ నటిస్తోన్న అమిగోస్, చిరంజీవి భోళా శంకర్, సందీప్ కిషన్ బడ్డీ, నవీన్ పోలిశెట్టి, అనుష్కల కొత్త సినిమా, డీజే టిల్లు సీక్వెల్, వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా, వరుణ్ తేజ్ న్యూ ప్రాజెక్ట్, సాయిధరమ్ తేజ్ విరుపాక్ష, మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాలు థియేట్రికల్ రన్ కంప్లీట్ కాగానే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరుసగా చిత్రాల ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకోని మిగతా ఓటీటీ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీంతో ప్రస్తుతం నెట్టింట్లో #netflixsouth #netflixpandaga ట్యాగ్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.