Tollywood: వెంకటేష్‌తో కలిసి నటించిన ఈ బుడతడు.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా? కటౌట్ చూస్తే.!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. ఆ తర్వాత హీరోలుగా ఎంట్రీ నటులను మనం చాలామందినే చూసే ఉంటాం..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. ఆ తర్వాత హీరోలుగా ఎంట్రీ నటులను మనం చాలామందినే చూసే ఉంటాం. కమల్ హాసన్, తనీష్, తేజ సజ్జా, వైష్ణవ్ తేజ్, తరుణ్.. ఇలా ఈ లిస్టులో ఎందరో ఉన్నారు. ఇదిలా ఉంటే.. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సూర్యవంశం’ చిత్రం గుర్తుండొచ్చు. అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరన్నది మీకు ఈపాటికి బ్రెయిన్‌లో స్ట్రైక్ అవ్వొచ్చు. అతడెవరో కాదు.. ఆనంద్ వర్ధన్.
తన నటనకు గానూ ‘నంది అవార్డు’ అందుకోవడమే కాదు.. పలు హిట్ చిత్రాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సూర్యవంశం’, ‘మా విడాకులు’, ‘మనసంతా నువ్వే’, ‘బాల రామాయణం’, ‘ప్రియరాగాలు’, ‘ప్రేయసి రావే’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘ఇంద్ర’, ‘నేనున్నాను’ లాంటి చిత్రాల్లో కనిపించాడు ఆనంద్ వర్ధన్. 1996లో సినీ ఇండస్ట్రీకి బాల నటుడిగా అడుగుపెట్టిన ఇతడు.. సుమారు 14 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.
ప్లేబ్యాక్ సింగర్ పిబి శ్రీనివాస్ మనవడైన ఆనంద్ వర్దన్.. 2004లో వచ్చిన ‘నేనున్నాను’ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. 2012లో తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఆనంద్.. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో లుక్‌లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసిన అతడు.. త్వరలోనే మళ్లీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.