Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unseen Video: సినిమాల్లోకి రాక ముందు చరణ్, శ్రియ స్నేహితులా? యాక్టింగ్ స్కూల్లో ఎలా ఉన్నారో మీరే చూడండి..

రామ్ చరణ్‌, శ్రియలకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో ఒక యాక్టింగ్ స్కూల్‌లో సినిమాకు సంబంధించి స్కిల్స్ నేర్చుకుంటూ కనిపించాడు రామ్‌చరణ్‌. చెర్రీతో పాటు హీరోయిన్ శ్రియ కూడా ఆ వీడియోలో కనిపించడం విశేషం.

Unseen Video: సినిమాల్లోకి రాక ముందు చరణ్, శ్రియ స్నేహితులా? యాక్టింగ్ స్కూల్లో ఎలా ఉన్నారో మీరే చూడండి..
Ram Charan Tej, Shriya
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2023 | 3:09 PM

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్‌ చరణ్‌ ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అతని చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. ఇష్టం సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించింది శ్రియా శరణ్. తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి సీనియర్‌ హీరోలతో పాటు పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్ తదితరయ యువ హీరోల పక్కన నటించి మెప్పించింది. అయితే రామ్ చరణ్‌, శ్రియలకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో ఒక యాక్టింగ్ స్కూల్‌లో సినిమాకు సంబంధించి స్కిల్స్ నేర్చుకుంటూ కనిపించాడు రామ్‌చరణ్‌. చెర్రీతో పాటు హీరోయిన్ శ్రియ కూడా ఆ వీడియోలో కనిపించడం విశేషం. ఇద్దరూ కలిసి ఒక సీన్‌ రిహర్సల్స్‌ చేస్తూ దర్శనమిచ్చారు. ఈ వీడియోలో వారిని చూస్తుంటే ఇద్దరు అప్పటికింకా ఇండస్ట్రీలోకి రాలేదని తెలుస్తోంది.

కాగా చరణ్ సినిమాల్లోకి రాకముందు ముంబైలో శిక్షణ తీసుకున్నాడట. శ్రియ కూడా ఆ యాక్టింగ్ స్కూల్ కి వెళ్లి ఓ సీన్ లో నటించిందట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. ఏంటి చెర్రీ, శ్రియా ఒకే యాక్టింగ్‌ స్కూల్‌లో సినిమా పాఠాలు నేర్చుకున్నారా? అసలు నమ్మలేకున్నాం. వీరిద్దరిని ఇలా చూడడం సంతోషంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో శ్రియ కూడా ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీ ప్లాష్‌బ్యాక్‌ సీన్లలో శ్రియ తల్లిగా నటించడం కొసమెరుపు. కాగా సుమారు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఈ హీరోయిన్‌ గతేడాది మూడు సినిమాల్లో నటించింది. ఆర్‌ఆర్‌ఆర్‌తో సహా తడ్కా, దృశ్యం2 (హిందీ) సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ఉపేంద్ర కబ్జా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..