Central Silk Board Jobs: నెలకు రూ.లక్షన్నర జీతంతో సెంట్రల్‌ సిల్క్‌ బోర్డ్‌లో కొలువులు.. టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీలో పాసైన వారు అర్హులు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ సిల్క్‌ బోర్డ్‌.. 142 కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌, స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, యూడీసీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

Central Silk Board Jobs: నెలకు రూ.లక్షన్నర జీతంతో సెంట్రల్‌ సిల్క్‌ బోర్డ్‌లో కొలువులు.. టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీలో పాసైన వారు అర్హులు..
Central Silk Board
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2023 | 12:54 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెంగళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డ్‌.. 142 కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌, స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, యూడీసీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌/సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధింది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్‌ 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 16, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.1000లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రొఫీషియన్సీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.