AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthi 2023: పండగ వేళ కొండెక్కిన మల్లెపూల ధరలు.. కేజీ మల్లెలు అక్షరాలా రూ.6,200లు

మల్లెపూలు కేజీ మహా అయితే రూ.500లు ఉంటాయి. ఐతే ఈ ఊరిలో మాత్రం కిలో మల్లెపూలు ఏకంగా రూ.6,200ల వరకు ధర పలుకుతోంది. సంగతేమంటే..

Sankranthi 2023: పండగ వేళ కొండెక్కిన మల్లెపూల ధరలు.. కేజీ మల్లెలు అక్షరాలా రూ.6,200లు
Jasmine Flowers
Srilakshmi C
|

Updated on: Jan 15, 2023 | 11:22 AM

Share

మల్లెపూలు కేజీ మహా అయితే రూ.500లు ఉంటాయి. ఐతే తమిళనాడులోని ఈ ఊరిలో మాత్రం కిలో మల్లెపూలు ఏకంగా రూ.6,200ల వరకు ధర పలుకుతోంది. సంగతేమంటే.. తమిళనాడులోని ఇరోడ్‌ జిల్లా సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు రకరకాల పూలు సాగు చేస్తున్నారు. వాటిలో మల్లెపూలు 10 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. తెల్లవారుఝామునే రైతులు మల్లెపూలు కోసం సత్యమంగళం పూల మార్కెట్‌కు తీసుకువచ్చి కేరళతోపాటు వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు రవాణా చేస్తుంటారు. సత్యమంగళం పూల మర్కెట్‌కు సీజన్‌లో దాదాపు 3 నుంచి 5 టన్నుల వరకు మల్లెలు వస్తుంటాయి.

ఐతే ప్రస్తుతం శీతాకాలం అవడం చేత అక్కడ విపరీతంగా పొగ మంచుకురుస్తోంది. దీంతో మల్లెమొగ్గలు రాలిపోతున్నాయి. పూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు మల్లెపూలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో అక్కడ రైతులు కిలో మల్లెపూలు రూ.6,200కు ధర విక్రయిస్తున్నారు. పూలకు ధర పెరగడంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.