అది ఇళ్లా.. దొంగల బజారా..? ఏకంగా రూ. వంద కోట్ల విలువైన పురాతన వస్తువులు దాచిపెట్టాడుగా..

దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన పురాతన వస్తువులను అక్రమంగా తన ఇంట్లో దాచుకున్నాడో వ్యక్తి. సమాచారం అందుకున్న అధికారులు..

అది ఇళ్లా.. దొంగల బజారా..? ఏకంగా రూ. వంద కోట్ల విలువైన పురాతన వస్తువులు దాచిపెట్టాడుగా..
Antique Items
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2023 | 8:00 AM

దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన పురాతన వస్తువులను అక్రమంగా తన ఇంట్లో దాచుకున్నాడో వ్యక్తి. సమాచారం అందుకున్న అధికారులు వ్యక్తి ఇంటిపై దాడి చేసి వాటిని సీజ్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం నాడు చోటు చేసుకున్న ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలంగా మారింది. అడ్మినిస్ట్రేటర్ జనరల్ అండ్ వెల్ఫేర్ ట్రస్టీ సీనియర్ అధికారి బిప్లబ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమబెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణాస్ జిల్లాలోని దేగంగా ప్రాంతంలో చంద్రకేతుగర్‌లో అసద్‌ ఉల్‌ జమాన్‌ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా 1,500 పురాతన వస్తువులను దాచిపెట్టాడు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేటర్ జనరల్ అండ్ వెల్ఫేర్ ట్రస్టీ అధికారులు శుక్రవారం కస్టమర్ల వేషంలో అసద్ ఉల్ జమాన్ ఇంటికి వెళ్లారు. అతని నుంచి అన్ని వివరాలు సేకరించిన అనంతరం అసద్ నివాసంపై దాడులు జరిపారు. సోదాల్లో 15,000 పురాతన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను ప్రాచీన భారత్‌కు చెందిన మౌర్య, కనిష్క సామ్రాజ్యాల కాలం నాటివిగా గుర్తించారు. వాటిల్లో 15 నుంచి 20 మాత్రమే ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ధ్రువీకరించిన వస్తువులుగా గుర్తించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు’ రాయ్‌ పేర్కొన్నారు.

2020లో కూడా బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.35.3 కోట్ల విలువైన 25 పురాతన విగ్రహాలను కోల్‌కతా కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. దీనిపై పక్కా సమాచారం అందడంతో ఆగష్టు 23 రాత్రి వడ్లు తీసుకెళ్తున్న ట్రక్కును తనిఖీ చేశారు. ట్రక్కు లోపల దాచిన పురాతన వస్తువులను సీజ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.