Snow Terror: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న మంచుతుపాను.. స్తంభించిపోయిన జనజీవనం..
ఉత్తరభారతాన్ని చలి వణికిస్తుంది. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తరభారతాన్ని చలి వణికిస్తుంది. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో మంచు పేరుకుపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దోడా , సోన్‌మార్గ్ , కుప్వారా తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. జమ్ము-శ్రీనగర్ హైవే పూర్తిగా మంచుతో నిండిపోయింది. రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. మంచును తొలగించడానికి అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు.
మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో హెలీకాప్టర్, బ్యాటరీ కార్ సేవలు నిలిచిపోయాయి. ఇక ఉత్తరాఖండ్‌లోను సేమ్ సిచ్వేషన్. చాలా చోట్ల కంటిన్యూస్ గా కురుస్తున్న మంచుతో ఇబ్బందులుపడుతున్నారు స్థానికులు. ఛార్‌ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఎటు చూసినా మంచు లోకమే కన్పిస్తోంది. గంగోత్రి పూర్తిగా మంచుతో నిండిపోయింది. గంగానది గడ్డకట్టిపోయింది. ఉత్తరాఖండ్‌లో చాలా చోట్ల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కేదార్‌నాథ్ క్షేత్రంలో కూడా హిమపాతం ఉక్కిరి బిక్కరి చేస్తోంది.
హిమపాతం కారణంగా పర్వత ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా హిమపాతం వణికిస్తోంది. సిమ్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏకంగా 210 రోడ్లు మంచుతో మూసుకుపోయాయి. నేషనల్ హైవే క్లోజ్ అయింది. ఉత్తర భారత ప్రాంతాలు తీవ్రమైన శీతల ప్రభావానికి గురవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..