Gold Price Today: పండుగ వేళ బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్.
వినియోగదారులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ ధరలో పెరుగుదల కనిపంచింది. నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 1000కిపైగా పెరగడం గమనార్హం. దీంతో 24 గ్రాముల బంగారం ఏకంగా...
వినియోగదారులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ ధరలో పెరుగుదల కనిపంచింది. నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 1000కిపైగా పెరగడం గమనార్హం. దీంతో 24 గ్రాముల బంగారం ఏకంగా రూ. 56 వేలు దాటేసింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆదివారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 400 పెరిగి రూ. 52,000గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 52,000గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,730గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,960 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,770గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,050 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 56,780 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 52,000 24 క్యారెట్స్ ధర రూ. 56,730గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధర కూడా పెరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం కిలో వెండిపై ఏకంగా రూ. 750 వరకు పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,750గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,000గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 75,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..