Bajaj Electric scooter: బజాజ్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎంత క్యూట్‌గా ఉందో మీరే చూడండి..
ఇదే కోవలో చైనాకు చెందిన యూలు కూడా కొత్త మినీ మోపెడ్ ఈ- బైక్ ను ఆవిష్కరించింది. బజాజ్ కంపెనీ దీనిని తయారు చేసింది.. త్వరలో ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశాలున్నాయి.
యూఎస్ఏలోని లాస్ వేగాస్ లో జరిగిన కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES) ను వేదికగా చేసుకొన్న కంపెనీలు అనేక రకాల ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాలను అత్యాధునిక ఫీచర్లతో ప్రదర్శించాయి. వాటిలో కార్లు, బైక్ లు ట్రక్ లు కూడా ఉన్నాయి. చాలా ఉత్పత్తులు కొనుగోలుదారులను అమితంగా ఆకర్షించాయి. ఇదే కోవలో చైనాకు చెందిన యూలు కూడా కొత్త మినీ మోపెడ్ ఈ- బైక్ ను ఆవిష్కరించింది. బజాజ్ కంపెనీ దీనిని తయారు చేసింది.. త్వరలో ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బైక్ లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం..
సిటీ పరిధికి బెస్ట్..
ఈ ద్విచక్ర వాహనం తక్కువ దూరం ప్రయాణాల కోసం రూపొందించబడింది. ఇది డెలివరీ వాహనంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ముందు, వెనుక కార్గో స్పేస్‌ను అందిస్తుంది. యూలు గతంలో చైనా కంపెనీకి చెందినది. కానీ దీని షేర్లను బజాజ్ కొనుగోలు చేసింది. ఇప్పుడు తయారు చేయబడిన యూలు ఈ-మోపెడ్ పాత వాటి కంటే పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే బజాజ్ తన మార్క్ చూపించేందుకు కొన్ని ప్రత్యేక మార్పులు దీనిలో చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బజాజ్ మన దేశ వాతావరణానికి తగిన వాహనంగా తీర్చిదిద్దేందుకు అనువైన మార్పులు చేపట్టినట్లు సమాచారం. అయితే ఎలాంటి ఫీచర్లను తీసుకొచ్చారు.. ఏమేమి మార్పులను చేశారనే వివరాలను బజాజ్ వెల్లడించలేదు.
ఇది రెండోది..
భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఈ బైక్ ను అభివృద్ధి చేసినందున, అతి త్వరలో భారతదేశంలో దీనిని అమ్మకానికి తీసుకురావచ్చనే అంచనా ఉంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ప్లాన్ల వివరాలను బజాజ్ వెల్లడించలేదు. అదే సమయంలో, బజాజ్ ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ప్రీమియం ఫీచర్లతో కూడిన సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్‌ను అందిస్తోంది. బజాజ్ నుంచి ఈ ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మాత్రమే ఉంది. ఈ ద్విచక్ర వాహనానికి భారతీయుల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది. దీనిలో ప్రీమియం, అర్బన్ రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎకో , స్పోర్ట్ అనే రెండు రకాల డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ పూర్తిగా ఛార్జ్ చేస్తే 95 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అటువంటి సూపర్ రేంజ్ కోసం 3 kWh బ్యాటరీ ప్యాక్ ఛాసిస్‌పై అమర్చబడింది. 100 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..