Ashwini Vaishnav: ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. కేవలం రెండు గంటల్లోనే ప్రయాణం
దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పడుతోంది. ప్రధాన నగరాల గుండా ఈ రైలు ప్రారంభం కాగా, మరి కొన్ని నగరాల గుండా ప్రారంభం కాబోతోంది. ఈ రైలు వేగం కారణంగా ప్రయాణ సమయం చాలా తక్కువగా ఉండనుంది..
దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పడుతోంది. ప్రధాన నగరాల గుండా ఈ రైలు ప్రారంభం కాగా, మరి కొన్ని నగరాల గుండా ప్రారంభం కాబోతోంది. ఈ రైలు వేగం కారణంగా ప్రయాణ సమయం చాలా తక్కువగా ఉండనుంది. ఢిల్లీ- జైపూర్ మధ్య సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం, భారత ప్రభుత్వం రెండు నగరాల మధ్య వందే భారత్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. రెండు నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైలు సర్వీసులు ప్రారంభమైన తర్వాత కేవలం 1 గంట 45 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ అంచనా సమయం ఢిల్లీ-జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్ నుండి ఆశించిన సమయం కంటే తక్కువగా ఉందని గమనించాలన్నారు. ప్రస్తుతం రెండు నగరాల మధ్య ప్రయాణించేందుకు ప్రయాణికులకు 5-6 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు ఈ సమయం మరింతగా తగ్గనుంది.
జైపూర్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు బీజేపీ సభ్యుడు రామ్‌చరణ్ బోహ్రా శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. 900 కోట్లతో ఎంపీ రైల్వే ప్రాజెక్టులకు మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. ఢిల్లీ, జైపూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ మార్చి 2023 లోపు ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.
జైపూర్‌లోని సంగనేర్ రైల్వే స్టేషన్‌ను మంత్రిత్వ శాఖ మెరుగుపరుస్తుందని రైల్వే మంత్రి అన్నారు. జైపూర్ నుండి సవాయ్ మాధోపూర్ మధ్య రైలు మార్గాల డబ్లింగ్ చేయనున్నారు. డిగ్గీ-మల్‌పురా జంక్షన్‌లో ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు అండర్‌పాస్‌ను నిర్మించనున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సెమీ-హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తయారు చేసింది. ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. అయితే, రైలు పరిస్థితి, ఇతర కారణాల వల్ల ఇది ప్రస్తుతం గంటకు 130 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఢిల్లీ – జైపూర్ మధ్య సగటు వేగం గంటకు 130 కి.మీ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి