AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crypto Currency: క్రిప్టో కరెన్సీ అనేది జూదం లాంటిది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ గవర్నర్‌

క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్‌మెంట్లు ఒక వ్యసనం లాంటివని వ్యాఖ్యానించారు. వీటిని ఏ దేశం..

Crypto Currency: క్రిప్టో కరెన్సీ అనేది జూదం లాంటిది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ గవర్నర్‌
Rbi Governor Shaktikanta Das
Subhash Goud
|

Updated on: Jan 14, 2023 | 6:06 PM

Share

క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్‌మెంట్లు ఒక వ్యసనం లాంటివని వ్యాఖ్యానించారు. వీటిని ఏ దేశం కూడా జాతీయ కరెన్సీగా గుర్తించవని శక్తికాంతదాస్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీటిని నిషేధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ జస్ట్‌ డిజిటల్ కరెన్సీ అని వాటికి ఎలాంటి విలువ లేదని, అయితే, వాటికి విలువ ఉన్నట్లుగా మూడో వ్యక్తులు నమ్మిస్తున్నారని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ అనేది అంతా ఒక బూటకమని చెప్పుకొచ్చారు. ఆర్బీఐ గవర్నర్‌ ఓ సందర్భంతో మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఆస్తికైనా, ఆర్థిక ఉత్పత్తికైనా అంతర్గత విలువ అనేది ఒకటి ఉండాలని, కానీ క్రిప్టోల విషయంలో అలాంటి విలువ ఏదీ లేదని అన్నారు.

అటువంటి కరెన్సీలపై వ్యతిరేకతను మరింత పెంచడానికి, ఇతర సెంట్రల్ బ్యాంకుల కంటే ముందంజ వేయడానికి, ఆర్‌బీఐ ఇటీవల డిజిటల్ కరెన్సీని పైలట్ మోడ్‌లో ఇ-రూపాయి రూపంలో ప్రారంభించింది. మన దేశంలో జూదం అడటానికి అనుమతి లేదని, జూదాన్ని అనుమతించాలనుకుంటే క్రిప్టోలను జూదంగా పరిగణించాలన్నారు. ధనం పేరుతో జూదం ఆడటాన్ని అనుమతించబోమని స్పష్టం ఆయన చేశారు. అందుకే క్రిప్టోను నిషేధించాలని పిలుపునిచ్చారు. దానిని స్వీకరించడం లాజిస్టిక్స్‌, ప్రింటింగ్‌ ఖర్చులను ఆదా చేయడంలో సాయపడుతుందని శక్తికాంత దాస్‌ చెప్పారు.

క్రిప్టోలను చట్టబద్ధం చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత డాలరైజేషన్‌కు దారితీస్తుందని హెచ్చరిస్తూ, క్రిప్టోస్‌ను ఆర్థిక ఉత్పత్తి లేదా ఆర్థిక ఆస్తిగా మార్చుకోవడం పూర్తిగా తప్పుడు వాదన అని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి