Mumbai: రెండో తరగతి విద్యార్థిని పట్ల దారుణం.. ఫీజు కట్టలేదని ఎగ్జామ్ పెట్టలేదు.. చివరకు అదిరిపోయే ట్విస్ట్..
కొన్ని ప్రైవేటు స్కూళ్లు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారిలో కించిత్ కూడా మార్పు రావడం లేదు. స్టూడెంట్స్ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఫీజు కట్టలేదనే కారణంతో తోటి...
కొన్ని ప్రైవేటు స్కూళ్లు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారిలో కించిత్ కూడా మార్పు రావడం లేదు. స్టూడెంట్స్ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఫీజు కట్టలేదనే కారణంతో తోటి విద్యార్థులతో వేరు చేస్తున్నారు. ఎగ్జామ్స్ కూడా పెట్టడం లేదు. తాజాగా ముంబయిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఫీజు చెల్లించలేదనే కారణంలో ఓ బాలికకు పరీక్ష పెట్టలేదు స్కూల్ మేనేజ్మెంట్. విషయం తెలుసుకున్న చిన్నారి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముంబయిలో దాదర్ లో ఉండే పాఠశాలలో లోకల్ గా చాలా పేమస్. ఆ స్కూల్ లో ఓ బాలిక రెండో తరగతి చదువుతోంది. పాఠశాలలో ఇటీవల జరిగిన యూనిట్ పరీక్షకు చిన్నారిని అనుమతించలేదు. బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఫీజు కట్టలేదన్న కారణంతో చిన్నారిని పరీక్ష రాయనివ్వలేదు.
విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరీక్ష సమయంలో తరగతి గదిలో ఇతర చిన్నారులకు దూరంగా వేరుగా కూర్చోబెట్టారని అందులో తెలిపారు. అతని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. జువెనైల్ జస్టిస్ యాక్టు సెక్షన్ 75 కింద స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
మరోవైపు ఈ విషయాన్ని చిన్నారి తండ్రి విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. వారి సూచన మేరకు బాలికకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించడం గమనార్హం. కాగా..చాలా మంది అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన వారు ఈ స్కూల్లో చదువుకున్నవారే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..