Health: సాక్స్ వేసుకుని నిద్రపోతే ఎన్నో ప్రయోజనాలు.. కానీ ఆలా చేస్తే మాత్రం.. బీ అలర్ట్..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Jan 15, 2023 | 6:40 AM

చలికాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వాతావరణంలో ఉండే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. ముఖ్యంగా పాదాలు చల్లగా ఉన్నప్పుడు.. అవి రక్త నాళాలను సంకోచింపజేస్తాయి....

Health: సాక్స్ వేసుకుని నిద్రపోతే ఎన్నో ప్రయోజనాలు.. కానీ ఆలా చేస్తే మాత్రం.. బీ అలర్ట్..
Sleeping Tips

చలికాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వాతావరణంలో ఉండే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. ముఖ్యంగా పాదాలు చల్లగా ఉన్నప్పుడు.. అవి రక్త నాళాలను సంకోచింపజేస్తాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. నిద్రపోయే ముందు పాదాలను వేడిగా ఉంచుకోవాలని, ఇలా చేయడం ద్వారా నిద్రపోయేందుకు మెదడుకు సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. పాదాలను వేడిగా ఉంచడం కోసం.. సాక్స్ ధరించడం సురక్షితమైన మార్గం. వింతగా అనిపించినా, సాక్స్‌లు వేసుకుని నిద్రించడం వల్ల త్వరగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఉష్ణోగ్రత నియంత్రణ అనేది నిద్ర చక్రంలో ముఖ్యమైన భాగం. ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రత రాత్రి సమయంలో పడిపోతుంది. అత్యల్ప ఉష్ణోగ్రత ఉదయం 4 గంటలకు చేరుకోవచ్చు. సగటు శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ (°F), అయితే ఇది 24 గంటల వ్యవధిలో 1 నుంచి 2 డిగ్రీల వరకు మారుతుంది.

పాదాలకు ధరించే సాక్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. సాక్స్ పరిశుభ్రంగా లేకపోతే.. అది చర్మ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ప్రత్యేకించి సాక్స్ నైలాన్ వంటి సింథటిక్ పదార్థంతో తయారైనదైతే పరిశుభ్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. నిద్రవేళలో సాక్స్ ధరించకుండా ఉండాలనుకుంటే.. పాదాలను వెచ్చగా ఉంచడానికి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే.. చెప్పులు వేసుకుని నిద్రపోవచ్చు. పాదాలను కప్పేలా దుప్పటి కప్పుకోవాలి. నిద్రపోయే సమయానికి 1 లేదా 2 గంటల ముందు స్నానం చేయాలి.

కొన్ని పరిశోధనల్లో వయస్సుతో పాటు నిద్ర అవసరం మారకపోవచ్చు అని తెలియజేశాయి. కానీ అవసరమైన నిద్రను పొందే సామర్థ్యం వయస్సుతోపాటు తగ్గిపోతుంది. వృద్ధులకు వారి అనారోగ్యాలు, మందుల కారణంగా నిద్రపోయే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.వయస్సుతోపాటు నాణ్యమైన నిద్ర కూడా తగ్గుతుంది. వృద్ధుల నిద్ర నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. దీని వెనుక నిద్రలేమి, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, స్లీప్ అప్నియా, అర్ధరాత్రి మూత్రవిసర్జన వంటి అనేక కారణాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu